కొత్త సంసారంలో సోషల్ మీడియా చిచ్చు... సెల్ ఫోన్ కోసం భర్తనే కాదనుకున్న నవవధువు

By Arun Kumar PFirst Published Jun 1, 2023, 4:26 PM IST
Highlights

సోషల్ మీడియాలో మునిగితేలుతూ మొబైల్ ఫోన్ కు బానిసైన యువతి ఇందుకోసం చివరకు భర్తనే వదిలిపెట్టేందుకు సిద్దమయ్యింది.  

బిహార్ : కూడు, గూడు, గుడ్డ వంటి నిత్యావసరాలు లేకుండా అయినా బ్రతకగలరేమో గానీ సెల్ ఫోన్ లేకుండా బ్రతకలేరు అన్నట్లుగా నేటితరం తయారయ్యింది. స్మార్ట్ ఫోన్ అనేది నేటి మనిషి జీవితంలో భాగమైపోయింది. బ్యాంక్ అకౌంట్ లేకున్నా సరే సోషల్ మీడియాలో అకౌంట్ లేకుంటే చులకనగా చూసే పరిస్థితి సమాజంలో వుంది. చివరకు పచ్చని సంసారంలో చిచ్చులు పెడుతున్నాయి ఈ సెల్ ఫోన్లు. అతిగా ఫోన్ వాడుతున్నందుకు అత్తింటివారు మందలించారని ఓ నవవధులు ఏకంగా కట్టుకున్న భర్తనే వదిలేసింది. ఈ విచిత్ర సంఘటన బిహార్ లో వెలుగుచూసింది. 

హజీపూర్ కు చెందిన ఇలాయాజ్ కు సాబా ఖతూన్ తో నాల్రోజుల క్రితమే వివాహమయ్యింది. భర్తతో కలిసి అత్తవారింటికి వచ్చిన నవవధువు అతిగా సెల్ ఫోన్ వాడుతుండటం పెద్ద గొడవకు దారితీసింది. నేటితరంలో యువత అందరి మాదిరిగానే సాబా కూడా సోషల్ మీడియా అకౌంట్స్ కలిగి నిత్యం వాటిలో మునిగితేలుతుంది. కొత్త కోడలు ఇంట్లోపని విడిచిపెట్టి సెల్ ఫోన్ పట్టుకుని కూర్చోవడం అత్తామామలకు నచ్చలేదు. దీంతో ఆమెను మందలించారు.  

ఇలియాజ్ కూడా భార్యను అతిగా ఫోన్ వాడొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇలా అత్తామామలు, భర్త తనను సెల్ ఫోన్ వాడొద్దని మందలించిన విషయాన్ని పుట్టింటివారికి చెప్పింది సాబా. దీంతో ఆమె సోదరులు ఆగ్రహంతో సొంత బావను తుపాకీతో బెదిరించారు. తమ చెల్లినే మందలిస్తారా అంటూ అతడి తల్లిదండ్రులను కూడా బెదిరించారు. ఇలా సెల్ ఫోన్ విషయంలో ప్రారంభమైన గొడవ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. 

Read More  మరిదితో మూడేళ్లుగా వదిన రాసలీలలు.. అతడితో కలిసి బతకాలని ఆశపడింది.. కానీ చివరకు..

ఇలియాజ్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సాబా సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమ బిడ్డను అత్తింటివారు వేధిస్తున్నారని సాబా తల్లి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

అయితే ఇంత జరిగాక ఇక తాను భర్తను కలిసి వుండలేనని సాబా ఖతూన్ తేల్చేసింది. అత్తవారి ఇంటినుండి ఆమెను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకునివెళ్ళారు. ఇలా సెల్ ఫోన్ విషయంలో జరిగిన గొడవ ఏ అచ్చటా ముచ్చటా తీరని నూతన వధూవరులను దూరం చేసింది. 

click me!