
బెంగళూరు : ఈ కలికాలంలో మానవ సంబంధాలకు అసలు విలువే లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా జీవితాంతం కలిసి జీవించాల్సిన భార్యాభర్తలు చిన్నచిన్న కారణాలతో విడిపోతున్నారు. మరికొందరి సంసారంలో అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ఇలా భర్త స్నేహితుడితోనే అక్రమ బంధాన్ని కొనసాగిస్తున్న మహిళ చివరకు అతడితోనే పరారయ్యింది. పెళ్లయిన రెండు నెలలకే నవ వధువు భర్త స్నేహితుడితో లేచిపోయిన ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.
బాధిత భర్త తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ కు చెందిన రమేష్ కు రెండు నెలల క్రితమే పెళ్లయ్యింది. పెళ్లి పనులన్నీ ముగిసిన తర్వాత ఇటీవలే కొత్త సంసారాన్ని ప్రారంభించారు. అయితే ఒకరిగురించి ఒకరు పూర్తిగా తెలుసుకోకముందే రమేష్ కు భార్య షాక్ ఇచ్చింది.
రమేష్ భార్యపై కన్నేసిన స్నేహితుడు కార్తీక్ మాయమాటలతో ఆమెను లోబర్చుకున్నాడు. భర్తకు తెలియకుండా కొద్దిరోజులు కార్తిక్ తో రహస్య బంధాన్ని కొనసాగింది. ఇటీవల మరింత బరితెగించిన నవ వధువు ఇంట్లో భర్తను బంధించి ప్రియుడితో పరారయ్యింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read More వివాహేతర సంబంధం పెట్టుకున్నారని స్థంభానికి కట్టేసి కొట్టారు.. వీడియో వైరల్..
ఈ నెల 12న భర్త రమేష్ స్నానానికి వెళ్లగానే ముందుగానే సర్దుకున్న బట్టలు, నగలు, డబ్బులు తీసుకుని భార్య పరారయ్యింది. భార్య బాత్రూంకు గడియపెట్టి, ఇంటికి తాళం వేసి వెళ్లడంతో రమేష్ బయటకు రాలేకపోయాడు. కొంతసేపటికి ఎలాగోలా బాత్రూంలోంచి బయటకువచ్చిన అతడు కుటుంబసభ్యులకు ఫోన్ చేసాడు. వారు ఇంటి తాళం పగలగొట్టి రమేష్ ను బయటకు తీసుకువచ్చారు.
నేరుగా ఆర్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రమేష్ స్నేహితుడు కార్తీక్ తో కలిసి భార్య పరారయ్యిందని ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికోసం గాలింపు చేపట్టారు. ఎలాంటి అనుమానం రాకుండా భార్య, స్నేహితుడు నమ్మించి మోసం చేసాడని బాధితుడు రమేష్ వాపోయాడు.