డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన వారం రోజులకే..మృతి

By ramya neerukondaFirst Published Oct 5, 2018, 11:55 AM IST
Highlights

రమీల ఉమాశంకర్‌(44) బెంగళూరు నగర డిప్యూటీ మేయర్‌గా ఎంపికయ్యారు. బాధ్యతలు తీసుకుని కనీసం వారమైనా గడవకముందే గురువారం రాత్రి తీవ్ర గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. 

డిప్యూటీ మేయర్ గా ఎన్నికై  కనీసం వారం రోజులు కూడా గడవలేదు. ఆలోపే ఆమెను మృత్యువు కబలించింది. ఈ సంఘటన బెంగళూరు లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సెప్టెంబరు 28న జేడీఎస్‌కు చెందిన రమీల ఉమాశంకర్‌(44) బెంగళూరు నగర డిప్యూటీ మేయర్‌గా ఎంపికయ్యారు. బాధ్యతలు తీసుకుని కనీసం వారమైనా గడవకముందే గురువారం రాత్రి తీవ్ర గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆమె కావేరీపుర వార్డు కార్పొరేటర్‌.

ఉమాశంకర్‌ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం వ్యక్తంచేశారు. ఆమె నిబద్ధత కలిగిన సామాజిక కార్యకర్త అని, పార్టీ కోసం ఎంతో చేశారని అన్నారు. ఆమె మరణ వార్త తెలుసుకుని షాక్‌కు గురయ్యానని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నిన్న కూడా ఆమె మెట్రో ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆమె మరణం షాక్‌కు గురిచేసింది.’, ‘డిప్యూటీ మేయర్‌ రమీలా ఉమాశంకర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం, అకస్మాత్తుగా 44ఏళ్ల వయసులో ఆమె చనిపోవడం చాలా బాధ కలిగిస్తోంది’ అని పలువురు ట్వీట్లు చేశారు.

click me!