తమిళనాడు, కేరళకు రెడ్ అలర్ట్.. చెన్నైకి పొంచివున్న వరద ముప్పు

By sivanagaprasad kodatiFirst Published Oct 5, 2018, 11:28 AM IST
Highlights

తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరేబియా సముద్రం, శ్రీలంక తీరంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిస్తుందని ఐఎండీ ముందే ప్రకటించింది.

దీనిలో భాగంగా తమిళనాడు, కేరళ ఇప్పటికే తడిసిముద్దవుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై మహానగరం జలమయమవుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

దక్షిణ చెన్నైలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 2015లో చెన్నైని వణికించిన వరద ముప్పు మరోసారి పొంచి వుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేరళలోని ఇడుక్కి, మలప్పురం జిల్లాలతో పాటు.. దక్షిణ కర్ణాటకలోని 12 జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆయా రాష్ట్రప్రభుత్వాలు అలర్ట్ చేశాయి. 

click me!