అయ్యో.. తల్లిపాలు గొంతులో ఇరుక్కుని నవజాతశిశువు మృతి.. తట్టుకోలేక ఆ మాతృమూర్తి చేసిన పని...

By SumaBala Bukka  |  First Published Mar 17, 2023, 9:03 AM IST

తల్లిపాలు గొంతులో ఇరుక్కుని ఉక్కిరిబిక్కిరి అవ్వడంతో ఓ 29 రోజుల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో ఆ తల్లి తీవ్ర మనస్తాపంతో మరో దారుణానికి ఒడిగట్టింది. 


కేరళ : కేరళలో మనసుల్ని మెలిపెట్టే ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. రోజుల వయసున్న ఓ నవజాత శిశువు తల్లిపాలు గొంతులో ఇరుక్కుని మరణించింది. 29 రోజుల ఆ శిశువుకు  పాలు తాగుతుండగా.. గొంతులో అడ్డం పడడంతో.. ఊపిరాడక మృతి చెందింది. దీన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ఆ వేదనలో తన మరో కుమారుడితో కలిసి.. బావిలో దూకింది. ఆత్మహత్య చేసుకుంది.  కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే..

కేరళలోని ఇడుక్కి జిల్లా ఉప్పుతర ప్రాంతంలో లిజా టామ్ (38)అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె కొద్ది రోజుల క్రితమే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అంతకుముందు ఆమెకు మరో కుమారుడు ఉన్నాడు. రోజులాగే ఆరోజు కూడా చిన్నారికి పాలిచ్చింది. తల్లిపాలు పడుతున్న సమయంలో చిన్నారి గొంతులో తల్లిపాలు ప్రమాదవశాత్తు ఇరుక్కున్నాయి.. అటు మింగలేక.. ఇటు బయటికి కక్కలేక.. ఆ చిన్నారి ఊక్కిరిబిక్కిరై చనిపోయింది. 

Latest Videos

వీడి దుంపతెగ.. తాగినమత్తులో తన పెళ్లి సంగతే మర్చిపోయాడు.. మండపానికే వెళ్లలేదు.. ఆ వధువు ఏం చేసిందంటే...

కళ్ళముందే.. తన కడుపు పంట  ఊపిరి వదలడం.. లిజా తట్టుకోలేకపోయింది. ఆ మనస్థాపాన్ని తట్టుకోలేక తన ఏడేండ్ల కుమారుడైన బెన్ టామ్ (7)తో  కలిసి.. తమ ఇంటి ఆవరణలో ఉన్న  40 అడుగుల లోతైన బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వచ్చే సరికే తల్లీ, కొడుకు మరణించారు. దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 

click me!