దారుణం.. కూతురు పుట్టిందని స్వీట్లు పంచి.. అదే కవర్లో శిశువును పెట్టి.. పొలంలో పారేసి..

By SumaBala BukkaFirst Published Jan 20, 2023, 12:51 PM IST
Highlights

నవమాసాలూ మోసి కన్న తల్లి.. ఆడపిల్ల అన్న కారణంతో నవజాత శిశువును అత్యంత అమానవీయంగా చంపేసింది. పుట్టి గంటలు కూడా గడవకముందే పొలాల్లో పడేయడంతో చలికి ఆ చిన్నారి మరణించింది.

రాజస్థాన్ : మగపిల్లాడి మీద కోరిక.. ఆ తల్లిని కన్నప్రేమను మరిచిపోయేలా చేసింది. దీంతో తల్లి కర్కశంగా వ్యవహరించింది. తొమ్మిదినెలలు మోసి, అష్టకష్టాలూ పడి కన్న బిడ్డను అత్యంత క్రూరంగా హత్య చేసింది. కొడుకు మాత్రమే పుట్టాలన్న మోజులో..  కూతురు పుట్టడంతో దారుణానికి ఒడిగట్టింది. వద్దనుకుంటే పుట్టిన కూతురును కర్కశంగా చలికి వదిలేసి బలిచ్చింది. 

అయితే సమాజం ముందు మాత్రం తమకు కూతురు పుట్టడం సంతోషమే అన్నట్టుగా కుటుంబసభ్యులతో కలిసి నటించారు. కూతురు పుట్టినందుకు సంతోషంగా ఆస్పత్రిలో స్వీట్లు కూడా పంచిపెట్టారు. అందరూ నమ్మారని నమ్మకం కుదిరాక.. ఆస్పత్రిలో పంచడానికి స్వీట్లు తెచ్చిన ఆ స్వీట్ల కవర్ లోనే చిన్నారిని కుక్కారు. తీసుకువెళ్లి.. దూరంగా పొలాల్లో ఆ కవర్ ను, చిన్నారిని వదిలేసి వచ్చారు. ఆ తరువాత ఆస్పత్రినుంచి మాయమయ్యారు. రోజూ వందలాది మంది వచ్చే ప్రభుత్వాసుపత్రి కావడంతో.. సుఖ ప్రసవం అయి ఇంటికి వెళ్లిపోయారనుకున్నారు అందరూ..

దారుణం.. ప్రియుడితో కలిసి మూడేళ్ల కుమార్తెను చంపి, కదులుతున్న రైలు నుంచి విసిరేసిన తల్లి.. ఎక్కడంటే ?

ఎముకలు కొరికే చలి మామూలుగానే పెద్దవాళ్లనే బతకనివ్వడం లేదు.. అప్పుడే కళ్లుతెరిచిన పసికందు పరిస్థితి ఇక చెప్పేదేముంది. చలికి బిగుసుకుపోయి, కళ్లు తెరిచి లోకాన్ని చూసిన కొద్ది గంటల్లోనే మనుషుల స్వార్థానికి, కర్కశత్వానికి బలైపోయింది. ఈ దారుణమైన ఘటన రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లాలో వెలుగు చూసింది. సోమవారం ఉదయం జిల్లాలోని బుహానా భిర్ రహదారి మీద ఓ నవజాత శిశువు మృతదేహం పోలీసులకు దొరికింది. 

దూరంగా పొలాల్లో.. ఓ స్వీట్ బ్యాగ్ లో నవజాతశిశువు ఉందన్న సమాచారంలో అక్కడికి చేరుకున్న పోలీసులకు బాలిక కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించి.. పరీక్షించారు. అయితే అక్కడ ఆ చిన్నారి అప్పటికే చనిపోయినట్లు తేలింది. అంతేకాదు ఆ శిశువు పుట్టి పదిహేను నుంచి ఇరవై గంటలు అయి ఉంటుందని తెలిపారు. ఎముకలు కొరికే చలిని తట్టుకోలేకే ఆ చిన్నారి మృతి చెందినట్లు కూడా తెలిపారు.

దీనిమీద వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీరి విచారణంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఆ చిన్నారి జన్మించినట్లు తేలింది.  అయితే తల్లిదండ్రుల ఆచూకీ లభించలేదు. వారికోసం వెతుకుతున్నారు. 

click me!