
ప్రపంచ ఆర్థిక వృద్ధి వేగం కొంత మందగించే సూచనలు ఉన్నప్పటికీ, పెట్టుబడిదారుల్లో ఆశాభావం పూర్తిగా తగ్గలేదు. కృత్రిమ మేథస్సు రంగంలో పెట్టుబడులు పెరగడం వల్ల ఉత్పాదకత మెరుగవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2.2 శాతం వృద్ధితో ముందుకెళ్లే అవకాశం ఉంది. భారత్‌లో ద్రవ్యోల్బణం కొంత ఎక్కువగానే కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయినా AI రంగం, డిజిటల్ మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు దేశ వృద్ధికి బలాన్ని ఇవ్వనున్నాయి.
2026లో భారత్ విదేశాంగ విధానంలో కొత్త వ్యూహాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేయడం, తూర్పు ఆసియా దేశాలతో సహకారం పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అమెరికాతో క్వాడ్ భాగస్వామ్యం, యూరప్ దేశాలతో రక్షణ సహకారం కీలకంగా మారనుంది. BRICS అధ్యక్ష బాధ్యతల ద్వారా గ్లోబల్ సౌత్‌కు భారత్ గొంతుకగా నిలవాలని భావిస్తోంది.
మొత్తంగా 2026 భారత్‌కు ప్రపంచంలో ప్రభావం పెరిగే సంవత్సరం కావొచ్చు. దేశీయ డిమాండ్, ప్రభుత్వ విధానాలు, సాంకేతిక రంగ పురోగతి భారత్‌ను ముందుకు నడిపిస్తాయి. అదే సమయంలో అంతర్జాతీయ వాణిజ్య ఒత్తిళ్లు, ఉపాధి రంగ సవాళ్లు జాగ్రత్తగా ఎదుర్కోవాల్సిన అంశాలుగా నిలుస్తాయి.
2026 ఎన్నికల ఏడాదిగా మారనుంది. త్వరలోనే పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
* పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. బిహార్‌లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ఇక బెంగాల్‌లోనూ జెండా ఎగరవేయాలని భావిస్తోంది.
* తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పించేందుకు ఏఐఏడీఎంకే కూటమి ప్రయత్నిస్తోంది. అయినా డీఎంకే పార్టీ బలంగా, ఏకతాటిపై కొనసాగుతోంది.
* కేరళలో కూడా బీజేపీ పాగా వేయాలని గట్టిగా ప్రయత్నం చేస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రావడంతో కేరళలో అద్భుతం జరిగే అవకాశాలున్నాయని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు.
* అసోంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ కొనసాగనుంది. ఈ రాష్ట్రంలో ప్రభావాన్ని నిలబెట్టుకోవడమే రెండు పార్టీల లక్ష్యం.
తెలంగాణలో 2026 మున్సిపల్ ఎన్నికలు కీలకం కానున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాస్త పోటీవచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో మున్సిపల్ ఎన్నికలను పార్టీలు సవాల్‌గా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండుళ్లు సమీపిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనంగా మారనున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు ముందస్తు చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రక్రియ డిసెంబర్ 30 నుంచి ప్రారంభమై జనవరి 10లోపు పూర్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 1న మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితా ముసాయిదాను అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఏపీలో కూడా 2026 కీలకగా మారనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. జనవరిలో స్థానిక సంస్థలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. వార్డుల విభజన, ఓటర్ల జాబితాల తయారీ వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు జనవరిలో, ఎంపీటీసీ/జెడ్పీటీసీ ఎన్నికలు జూలైలో జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను వైసీపీ ఛాలెంజింగ్‌గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
2026 సంవత్సరం క్రీడా ప్రపంచానికి ఎంతో ప్రత్యేకంగా ఉండనుంది. బ్యాక్ టూ బ్యాక్ పెద్ద టోర్నమెంట్లు, అంతర్జాతీయ ఈవెంట్లు జరగనున్నాయి. క్రికెట్ నుంచి ఫుట్‌బాల్, టెన్నిస్ నుంచి హాకీ వరకు అన్ని క్రీడల్లో అభిమానులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్ కూడా ఈ ఏడాది కీలక టోర్నమెంట్లకు ఆతిథ్యం ఇవ్వనుంది.
క్రికెట్:
* ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ – జనవరి 9 నుంచి
* భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ – జనవరి 11 నుంచి (3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు)
* ICC అండర్-19 పురుషుల ప్రపంచ కప్ – జనవరి 15 నుంచి
* ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) – మార్చి నుంచి మే వరకు
* ICC ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ – జూన్ నెలలో
* భారత్ ఇంగ్లాండ్ టూర్ – జూలై
* భారత్ శ్రీలంక టూర్ – ఆగస్టు
* భారత్ బంగ్లాదేశ్ టూర్ – ఆగస్టు
* భారత్ న్యూజిలాండ్ టూర్ – అక్టోబర్ నుంచి నవంబర్ వరకు
FIFA వరల్డ్ కప్ 2026 – జూన్ 12 నుంచి జూలై 26 వరకు
ఈసారి అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు కలిసి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలిసారి 48 జట్లు పాల్గొననున్నాయి.
* ఆస్ట్రేలియన్ ఓపెన్ – జనవరి 12 నుంచి ఫిబ్రవరి 1 వరకు
* ఫ్రెంచ్ ఓపెన్ – మే నుంచి జూన్
* విమ్బుల్డన్ – జూన్ నుంచి జూలై
* యూఎస్ ఓపెన్ – ఆగస్టు నుంచి సెప్టెంబర్
* ATP ఫైనల్స్ – నవంబర్
* అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హాకీ
* దోహా డైమండ్ లీగ్ – మే
* బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ – జూలై
FIH హాకీ వరల్డ్ కప్ – ఆగస్టు
కామన్వెల్త్ గేమ్స్ – జూలై (గ్లాస్గో)
ఆసియన్ గేమ్స్ – సెప్టెంబర్ (ఐచి, నాగోయా)
పారా ఆసియన్ గేమ్స్ – అక్టోబర్ (ఐచి, నాగోయా)