భారత్‌కు వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కొత్త రూల్స్ ..   

By Rajesh KarampooriFirst Published Nov 21, 2022, 10:15 PM IST
Highlights

భారత్‌కు వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనలు జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులు ఇకపై కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన స్వీయ డిక్లరేషన్ ఫారాలను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో పూరించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

భారత్‌కు వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనలు జారీ చేసింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కొన్ని నిబంధనల నుంచి మినయింపు ప్రకటించింది. ఇక నుంచి ఎయిర్ సువిధ ఫారమ్‌లను తప్పనిసరిగా నింపాలనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం నాడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ను జారీ చేసింది. సవరించిన మార్గదర్శకాలు నవంబర్ 22 నుండి అమలులోకి వస్తాయి.ఇంతకు ముందు ఎయిర్ సువిధ ఫారమ్‌ను తప్పని సరిగా నింపాల్సి వచ్చేంది. 

ఎయిర్ సువిధ అంటే ఏమిటి?

అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వారు భారతదేశానికి వచ్చే ప్రయాణీకులందరికీ ఎయిర్ సువిధ పేరుతో కాంటాక్ట్‌లెస్ సొల్యూషన్‌ను ప్రారంభించింది. భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు తమ వ్యాక్సినేషన్‌ స్థితి, టీకా డోసులు ఎన్ని వేయించుకున్నారో అన్నది తప్పని సరిగా ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో వెల్లడించాలి.  

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం..సెల్ప్-డిక్లరేషన్ ఫారమ్‌ను తప్పనిసరిగా నింపాలి. విదేశీ ప్రయాణికులందరూ తమ ప్రస్తుత ఆరోగ్య స్థితిని తెలియజేయడానికి ఇది ఆన్‌లైన్ పోర్టల్. భారత్ కు వచ్చే ముందు ఈ ఫారమ్‌ను తప్పని సరిగా పూరించాలి. భారతదేశానికి ప్రయాణించేటప్పుడు అనేక COVID-19 పరిమితులు ఉన్నాయి. మహమ్మారి సమయంలో భారత ప్రభుత్వం అమలు చేసిన ఎయిర్ సువిధ రూపం వాటిలో ఒకటి. 

click me!