గ్యాస్ లీకేజ్.. స్పృహ తప్పి పడిపోయిన అగ్నిమాపక సిబ్బంది..   

By Rajesh KarampooriFirst Published Nov 21, 2022, 8:31 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లోని నరేంద్రపూర్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజ్ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదకర గ్యాస్ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది ఆరోగ్యం కూడా క్షీణించింది

పశ్చిమ బెంగాల్ గ్యాస్ లీక్: పశ్చిమ బెంగాల్‌లోని నరేంద్రపూర్‌లో ఓ శీతల పానీయాల ప్లాంట్‌లో సోమవారం గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో విషవాయువులను పీల్చుకోవడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.ఈ సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి మూడు అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి.

ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఆరోగ్యం కూడా క్షీణించింది. వారికి చికిత్స కోసం తరలించారు. శీతల పానీయాల ప్లాంట్‌లో అమ్మోనియా గ్యాస్ లీకేజీ అయినట్టు తెలుస్తోంది. ఘటన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గ్యాస్ లీక్ అయిందని, గ్యాస్‌ విడుదలవడంతో కొంత మంది అస్వస్థతకు గురయ్యారని స్థానికులు పేర్కొంటున్నారు. గ్యాస్ లీకేజీ నియంత్రణకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 4 నుండి 5 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. అమ్మోనియా సరఫరా పైపులో లీకేజీ కారణంగా లీకేజీ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం లీకేజీ ఎక్కడుందో గుర్తించి వాల్వ్‌ను మూసివేశారు. కార్మికులందరినీ ఫ్యాక్టరీ నుంచి బయటకు తీసుకొచ్చి ఫైర్ టెండర్లతో నీళ్లు చల్లుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని కమల్‌గాజీ ప్రాంతంలో ఉన్న శీతల పానీయాల తయారీ యూనిట్‌లో గ్యాస్ లీకేజ్ జరిగింది. ఈ ప్రమాదంలో  పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని పోలీసులు తెలిపారు. కార్మికులను రక్షించేందుకు అక్కడికి వెళ్లిన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది కూడా అస్వస్థతకు గురయ్యారని పోలీసు అధికారి తెలిపారు.

ఫ్యాక్టరీ కార్మికులను, సమీపంలోని ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేయించి, సమస్య ఏమిటో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామనీ, గ్యాస్ యొక్క ఘాటైన వాసన చూస్తుంటే.. అది అమ్మోనియా అని అనిపిస్తుందని అని అధికారులు చెప్పున్నారు.  అమ్మోనియా అనేది ప్రాణాంతక వాయువు. ఈ వాయువు ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. అంతే కాకుండా.. ఈ గ్యాస్ వల్ల చర్మం, కళ్లు కూడా పాడవుతాయి.

click me!