మంగళూరు బ్లాస్ట్: అద్దెకు దిగాలంటే పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ తప్పనిసరి.. ఉగ్ర భయంతో కొత్త రూల్

By Mahesh KFirst Published Nov 26, 2022, 4:43 PM IST
Highlights

కర్ణాటకలోని మంగళూరులో అద్దెకు దిగాలంటే.. వారి వివరాలతో ముందుగా ఇంటి యజమానులు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్లు పొందాలి. ఈ కొత్త నిబంధనను మైసూరు పోలీసులు ప్రవేశపెట్టారు. మంగళూరు ఆటో రిక్షా బ్లాస్ కేసు నేపథ్యంలో ఈ నిబందన తెచ్చారు.
 

బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరు ఆటో రిక్షా బ్లాస్ట్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఉగ్రవాదుల ఘటనలు, పేలుళ్లు దాదాపు ఇక లేవు అనే స్థితిలో మరోసారి ఈ బ్లాస్ట్ కలవరం పెంచింది. దీంతో పోలీసులూ అలర్ట్ అయ్యారు. అన్ని కోణాల్లోనూ సెక్యూరిటీ కోసం నియమ నిబంధనలు తెచ్చారు. ఉగ్రఘటనలను నివారించే చర్యల్లో భాగంగా అద్దెకు దిగే వారికి, అద్దెకు ఇళ్లను ఇచ్చే ఓనర్లకూ ఒక రూల్ తెచ్చారు. అద్దెకు సంబంధించి పోలీసుల క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలని మైసూర్ పోలీసులు కొత్త రూల్ తెచ్చారు.

మైసూరు పోలీసులు రూపొందించిన కొత్త రెంటల్ పాలసీ ప్రకారం, తమ ఇంటిని ఎవరికి అద్దెకు ఇవ్వాలనుకున్నా ముందుగా ఇంటి యజమాని పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. సమీప పోలీసు స్టేషన్‌కు ఆ ఇంటి యజమాని వెళ్లి అద్దెకు వచ్చిన వారి వివరాలు సమర్పించాలి. అవి నిజమైనవేనని, నిర్దారించిన తర్వాత క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలని పేర్కొన్నాయి. రూ. 100 అప్లికేషన్ ఫీజుతో క్లియరెన్స్ సర్టిఫికేట్‌లను పోలీసు స్టేషన్‌లో తీసుకోవాలని వివరించాయి. బ్యాచిలర్‌లకు, ఫ్యామిలీలకు, పేయింగ్ గెస్టులకు వేర్వేరు దరఖాస్తులు ఉంటాయని తెలిపాయి. 

Also Read: కర్ణాటక బ్లాస్ట్‌తో ఐఎస్ఐఎస్‌కు లింక్.. ఇంట్లోనే బాంబులు తయారు చేస్తున్న నిందితుడు

ఇంటి యజమానులు తప్పకుండా కచ్చితమైన వివరాలు సమర్పించి ఆదేశాలను పాటించాలని ఓనర్లను ఉద్దేశిస్తూ పోలీసు కమిషనరర్ నోటీసులు జారీ చేశారు.

మంగళూరు బ్లాస్ట్ నిందితుడు షరీఖ్ ఈ ఉగ్ర కార్యకలాపాల కోసం ఓ ఇంటిలో అద్దెకు దిగాడు. అక్కడ ఆయన ఆధార్ కార్డు ఇచ్చాడు. కానీ, అవి ఆయన వివరాలు కావు. అవి మరొకరు నుంచి దొంగిలించి పొందిన ఆధార్ కార్డు వివరాలు. ఇలా ఫేక్ డాక్యుమెంట్లతో నగరంలో అద్దెకు దిగి ఉగ్ర కుట్రలకు తెరలేపే ముప్పు ఉన్నందున తాజాగా మైసూరు పోలీసులు ఈ కొత్త అడ్వైజరీలతో ముందుకు వచ్చారు. కర్ణాటక లోని మంగళూరు నగరంలో ఈ కొత్త రూల్ అమలు కానుంది.

click me!