New Parliament Building: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఏ కార్యక్రమం ఎప్పుడంటే..? 

By Rajesh KarampooriFirst Published May 28, 2023, 12:43 AM IST
Highlights

New Parliament Building: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 28న ప్రధాని మోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అయితే..కార్యక్రమానికి కొన్ని విపక్షాలు బహిష్కరణ పిలుపునిచ్చాయి. దీంతో కొన్ని పార్టీలు దూరంగా ఉండగా.. మరికొన్ని  పార్టీలు నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొనున్నాయి.

New Parliament Building: భారత ప్రజాస్వామ్య చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కానున్నది. అనేక హంగులు, ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. మే 28న జరిగే వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షత వహించనున్నారు. ప్రధాని మోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అయితే..కార్యక్రమానికి కొన్ని విపక్షాలు బహిష్కరణ పిలుపునిచ్చాయి.

ప్రధాని మోడీ కాకుండా రాష్ట్రపతి చేత పార్లమెంట్ ప్రారంభోత్సవం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోడీ చే ప్రారంభించాలని లోక్‌సభ సెక్రటేరియట్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ సహా దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. 

ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ పార్లమెంట్‌ను జాతికి అంకితం చేసే కార్యక్రమం రెండు దశలుగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ షెడ్యూల్ ను విడుదల చేశారు.

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇదే.. 

పార్ట్ I

7.15 AM: కొత్త పార్లమెంట్ భవనానికి  ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.

7.30 AM: దాదాపు గంటపాటు కొనసాగే హవన, పూజతో వేడుక ప్రారంభమవుతుంది.

8.30 AM: లోక్‌సభ ఛాంబర్‌కు ప్రధాని మోడీ చేరుకోనున్నారు.

9.00 AM: తమిళనాడుకు చెందిన ‘సెంగోల్’ అనే చారిత్రక దండను స్పీకర్ కుర్చీకి సమీపంలో ఏర్పాటు చేస్తారు.

9.30 AM: లాబీలో ప్రార్థన కార్యక్రమం జరుగుతుంది. ప్రార్ధన కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని పార్లమెంటు ప్రాంగణం నుండి నిష్క్రమిస్తారు.

పార్ట్ II

11.30 AM: అతిథులు, ప్రముఖుల రాక.

12.00 PM: ప్రధాని నరేంద్ర మోదీ రాక. జాతీయ గీతాలాపనతో వేడుక ప్రారంభమవుతుంది.

12.10 PM: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ , రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ ప్రసంగం.

12.17 PM: రెండు లఘు చిత్రాల ప్రదర్శన.

12.38 PM: రాజ్యసభలో ప్రతిపక్ష నేత ప్రసంగం (హాజరయ్యే అవకాశం లేదు). లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగం.

1.05 PM: రూ. 75 నాణెం , స్మారక స్టాంపును ప్రధానమంత్రి విడుదల చేస్తారు.

1.10 PM: ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం.

2.00 PM: వేడుక ముగుస్తుంది.

కొత్త పార్లమెంట్ భవనంలో లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 300 మంది ఎంపీలు కూర్చునేలా నిర్మించారు.  డిసెంబర్ 10, 2020న కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునాది వేశారు.

click me!