ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన రజనీకాంత్

By Rajesh KarampooriFirst Published May 28, 2023, 12:00 AM IST
Highlights

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో భాగంగా పార్లమెంటులో స్పీకర్ కుర్చీ సమీపంలో ఓ బంగారు రాజదండాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. ఈ ఘటనపై స్పందించిన సూపర్ స్టార్ రజనీకాంత్ .. తమిళులు గర్వపడేలా చేసిన ప్రధాని నరేంద్ర మోదీ(Modi)కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

నూతన పార్లమెంటు భవనాన్ని భారత ప్రధాని  మోదీ(Modi) రేపు  ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్లమెంటులో స్పీకర్ కుర్చీ సమీపంలో ఓ బంగారు రాజదండాన్ని కూడా ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఆ స్వాతంత్రోద్యమం అనంతరం  బ్రిటీష్ పాలకులకు, భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు మధ్య అధికార బదలాయింపునకు గుర్తుగా. రాజదండం నిదర్శనంగా నిలిచిందని, ఈ రాజదండాన్ని ‘సెంగోల్’ అని అంటారని, ఇది తమిళ పదం. 

ఇదిలాఉంటే.. సెంగోల్ తమిళ శక్తికి ప్రతీకగా అభివర్ణించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రజనీకాంత్ ట్వీట్ చేస్తూ.. 'తమిళ శక్తికి సాంప్రదాయ చిహ్నం - సెంగోల్. ఇది ఇప్పుడు కొత్త పార్లమెంటులో ప్రకాశిస్తుంది. ఈ సందర్భంగా  తమిళులు గర్వపడేలా చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో అధనుల (అర్చకుల) ఆశీస్సులు తీసుకున్నారు. తమిళనాడు నుంచి ఢిల్లీకి వచ్చిన అధనులు.. ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలుసుకుని.. కీర్తనల మంత్రోచ్ఛారణల మధ్య 'సెంగోల్ ( రాజ దండము)' సహా ప్రత్యేక బహుమతులను అందజేశారు. ప్రధాని మోడీ వారి ఆశీస్సులు తీసుకుని అభినందనలు తెలిపారు.

 

இந்திய நாட்டின் புதிய பாராளுமன்றக் கட்டடத்தில் ஜொலிக்கப் போகும் தமிழர்களின் ஆட்சி அதிகாரத்தின் பாரம்பரிய அடையாளம் - செங்கோல்.

தமிழர்களுக்குப் பெருமை சேர்த்த மதிப்பிற்குரிய பாரதப்பிரதமர் அவர்களுக்கு என் மனமார்ந்த நன்றி.

— Rajinikanth (@rajinikanth)

సమావేశం అనంతరం ప్రధాని మోదీ విపక్షాలను టార్గెట్ చేశారు. ఈ సెంగోల్‌తో గతంలో ఏమి చేశారో ఇప్పుడు మనం తెలుసుకున్నామని ప్రధాని అన్నారు. అధినం మహోంటోకు కృతజ్ఞతలు తెలుపుతూ, 'ఈరోజు మీరందరూ నా నివాసంలో ఉన్నారు, ఇది నా అదృష్టం. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మీరందరూ వచ్చి ఆశీర్వదించబోతున్నందుకు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు.  కాంగ్రెస్‌తో సహా పలు ప్రతిపక్ష పార్టీలు కార్యక్రమాన్ని బహిష్కరించిన నేపథ్యంలో ఆదివారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. కొత్త పార్లమెంటు భవనం ప్రతి భారతీయుడు గర్వించేలా ఉంటుందని మోదీ శుక్రవారం అన్నారు. కొత్త క్యాంపస్ వీడియోను కూడా పంచుకున్నాడు.

click me!