మహారాష్ట్రలో వరుస భూకంపాలు.. భయాందోళనల్లో స్థానికులు 

By Rajesh KarampooriFirst Published May 27, 2023, 11:09 PM IST
Highlights

Earthquake: మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో రెండు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయని మహారాష్ట్ర నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే.. ఎటువంటి ప్రాణనష్టం లేదని పేర్కొంది.

Earthquake: మహారాష్ట్ర(Maharastra)లో ఒకే రోజు రెండు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాల్ఘర్ జిల్లాలో శనివారం (మే 27) 3.3,3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. సాయంత్రం 5.15 గంటలకు 3.3 తీవ్రతతో మొదటి ప్రకంపనలు, సాయంత్రం 5.28 గంటలకు 3.5 తీవ్రతతో రెండో ప్రకంపనలు వచ్చినట్లు జిల్లా డిజాస్టర్ సెల్ చీఫ్ వివేకానంద్ కదం తెలిపారు.

జిల్లాలోని తలసరి ప్రాంతంలో వరుసగా ఎనిమిది కిలోమీటర్లు, ఐదు కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయని ఆయన తెలిపారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదని అధికారి తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తో పాటు, పాల్ఘర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ప్రకంపనలను ధృవీకరించింది.  

ఇదిలా ఉంటే. మహారాష్ట్రలో చివరి సారిగా ఫిబ్రవరిలో భూకంపం సంభవించింది.హింగోలిలో భూకంపించినట్టు అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.1గా నమోదైనట్లు తెలిపారు. భూకంప కేంద్రం నుండి 125 కిలోమీటర్ల మేర భూమి కంపిందని అధికారులు వెల్లడించారు.భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

click me!