కొత్త పార్లమెంటు భవనం ఓ ఫైవ్ స్టార్ జైలు - సంజయ్ రౌత్

By Sairam Indur  |  First Published Mar 1, 2024, 1:00 PM IST

ప్రధాని నరేంద్ర మోడీపై, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తాము అధికారం చేపట్టిన తరువాత పార్లమెంట్ పాత భవనంలోనే సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.


శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. కొత్త పార్లమెంటు భవనాన్ని ఫైవ్ స్టార్ జైలుతో పోల్చారు. కొత్త పార్లమెంట్ భవనంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం పనికి అనువుగా లేదు. కూర్చోవడానికి కూడా అనువుగా లేదు.’’ అని ఆయన అన్నారు. 

మేడిగడ్డ వద్ద దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడానికి కారణాలేంటి ? - కేటీఆర్

Latest Videos

కొత్త పార్లమెంటు ఫైవ్ స్టార్ జైలు లాంటిదని సంజయ్ రౌత్ అన్నారు. అక్కడ పని చేయలేమని తెలిపారు. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చారిత్రక పార్లమెంటు పాత భవనంలోనే సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 400 ఎంపీల కన్న ఎక్కువ సీట్లు గెలుచుకోవాలన్న ప్రధాని మోడీ విజన్ పై రౌత్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘‘2024 ఎన్నికలకు ప్రధాని మోడీ 400కు బదులుగా 600 లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. '400 మార్కు' చాలా తక్కువ.’’ అని సెటైర్లు వేశారు.

ఓయూలో నైట్ వాచ్ మెన్ కు 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. స్ట్రీట్ లైట్ల కింద చదివి విజయం..

రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండటంపై సంజయ్ రౌత్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. శరద్ పవార్ భారతదేశానికి ఉన్న అత్యుత్తమ వ్యవసాయ మంత్రుల్లో ఒకరని అన్నారు. ప్రధాని మోడీ స్వయంగా ఆ విషయాన్ని చెప్పారని రౌత్ తెలిపారు.

రెస్టారెంట్ లో పేలిన గ్యాస్ సిలిండర్.. చెలరేగిన మంటలు.. 44 మంది మృతి

ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం ప్రతిఘటన ఏమిటని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. రైతులను అడ్డుకుంటున్న తీరు సరికాదని తెలిపారు. ఇప్పటి వరకు వందలాది మంది రైతులు గాయపడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

click me!