జాక్‌పాట్: స్వదేశానికి తిరిగొస్తూ రూ.13 కోట్లు గెల్చుకొన్న ఇండియన్

First Published Jul 5, 2018, 2:23 PM IST
Highlights

దుబాయ్ నుండి స్వదేశానికి తిరిగొస్తున్న టోజో మాథ్యూ‌కు లాటరీ రూపంలో అదృష్టం లభించింది. సుమారు రూ.13.1 కోట్లను లాటరీ రూపంలో మాథ్యూ దక్కించుకొన్నారు. స్వదేశానికి తిరిగొస్తూ దుబాయ్ విమానాశ్రయంలో  మాథ్యూ కొనుగోలు చేసిన లాటరీకి ఈ ప్రైజ్ మనీ దక్కింది.


న్యూఢిల్లీ: స్వదేశానికి తిరిగి వస్తుండగా లాటరీ రూపంలో  ఓ భారతీయుడిని అదృష్టం వరించింది.ఈ లాటరీలో రూ.13.5 కోట్లు ఆయనకు దక్కాయి. కేరళకు చెందిన టోజో మాథ్యూ‌ ఈ లాటరీ డబ్బులను సంతోషంగా  స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు.

కేరళకు చెందిన  టోజో మాథ్యూ‌ అబుదబీలో సివిల్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. అయితే భార్యను వదిలి సుదూర ప్రాంతంలో ఉండడం ఇష్టం లేక  స్వదేశానికి రావాలని మాథ్యూ భావించాడు. ఈ నిర్ణయం మేరకు ఆయన జూన్ 24వ తేదీన ఇండియాకు వచ్చే సమయంలో అబుదబీ విమానాశ్రయంలో  ఓ లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు. 

అయితే మాథ్యూ కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్టుకు  పెద్ద మొత్తంలో బహుమతి దక్కింది.  రూ.13.1 కోట్లు మాథ్యూకు లాటరీ రూపంలో వచ్చాయి.ఈ మేరకు ఖలీజ్ టైమ్స్ పత్రిక ప్రకటించింది. 

భార్యతో ఢిల్లీలో కలిసుండాలనే ఉద్దేశ్యంతోనే  మాథ్యూ స్వదేశానికి వచ్చాడు. ఆయన  కొనుగోలు చేసిన లాటరీకి ప్రైజ్ రావడంతో ఆయన సంతోషానికి  అవధులు లేకుండా పోయాయి. 

కేరళలో స్వంత ఇల్లును నిర్మించుకోవాలనే తన కోరిక ఈ లాటరీ డబ్బులతో తీరనుందని మాథ్యూ అభిప్రాయపడ్డారు.  మాథ్యూతో తొమ్మిది మంది ఈ లాటరీలో ప్రైజ్ మనీని గెలుచుకొన్నారు. వీరిలో ఐదుగురు భారతీయులే కావడం  విశేషం.
 

click me!