New Delhi: కేంద్ర మాజీమంత్రి, ఆర్థికవేత్త యోగిందర్ కే అలఘ్ (83) కన్నుమూశారు. యోగిందర్ అలగ్ 1996-98 మధ్య సెంట్రల్ ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
former Union minister Yoginder K. Alagh: ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ మంత్రి అయిన యోగిందర్ కె అలఘ్ మంగళవారం నాడు 83 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. 1996-98లో ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యుత్ శాఖ మాజీ కేంద్ర మంత్రిగా ఆయన పనిచేశారు. అలఘ్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు మునీష్ అలఘ్ తెలిపినట్టు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
యోగిందర్ అలగ్ అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ రీసెర్చ్‌లో ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. అతని కుమారుడు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (IE)తో మాట్లాడుతూ "గత రెండు నెలలుగా ఆయన ఆరోగ్యం బాగులేదు. గత 20-25 రోజులలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది. ఇంట్లోనే కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం థాల్తేజ్ శ్మశానవాటికలో జరగనున్నాయి" అని తెలిపారు.
undefined
యోగిందర్ కే అలఘ్ జీవితం..
ప్రొఫెసర్ అలఘ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సహా అనేక మంది ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధాన మంత్రి ట్వీట్ చేస్తూ, “ప్రొఫెసర్ వై.కె.అలాఘ్ ఒక ప్రముఖ పండితుడు, అతను పబ్లిక్ పాలసీలోని వివిధ అంశాల పట్ల, ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, పర్యావరణం-ఆర్థిక శాస్త్రం పట్ల మక్కువ కలిగి ఉన్నాడు. ఆయన మృతితో ఎంతో బాధించింది. నేను మా పరస్పర చర్యలను గౌరవిస్తాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి" అని పేర్కొన్నారు.
Professor YK Alagh was a distinguished scholar who was passionate about various aspects of public policy, particularly rural development, the environment and economics. Pained by his demise. I will cherish our interactions. My thoughts are with his family and friends. Om Shanti.
— Narendra Modi (@narendramodi)
IRMA డైరెక్టర్ డాక్టర్ ఉమాకాంత్ దాష్ మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ ఆర్థిక రంగంలో డాక్టర్ అలఘ్ గౌరవనీయమైన వ్యక్తి అని అన్నారు. "ఆయన 2006-2012 వరకు IRMA ఛైర్మన్‌గా ఉన్నారు. అతని పదవీకాలంలో ఇన్స్టిట్యూట్ సంస్కృతికి, దాని విద్యాపరమైన ప్రయత్నాలకు విధానానికి, ముఖ్యంగా కీలకమైన అకడమిక్ కౌన్సిల్‌ను ప్రవేశపెట్టడంతో లోతైన మార్పును తీసుకువచ్చారు" అని దాష్ ఒక ప్రకటనలో తెలిపారు. "అలఘ్ మరణం IRMAకే కాకుండా యావత్ దేశానికి కూడా తీరని లోటు" అని పేర్కొన్నారు.