ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన.. కారుకు ఇరుక్కున్న మృతదేహం.. ఎంతో దూరం వెళ్లాక చూసుకుని..

By SumaBala BukkaFirst Published Feb 7, 2023, 2:09 PM IST
Highlights

కారు ఆగ్రా నుండి నోయిడా వైపు వెళుతున్న కారుకు ఓ వ్యక్తి మృతదేహం ఇరుక్కుని ఉండడం టోల్ బూత్ సిబ్బంది గమనించారు. 

మధుర : ఉత్తరప్రదేశ్ లో మరో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. హిట్ అండ్ రన్ కేసులో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని ఓ కారు కొన్ని కిలోమీటర్ల వరకు అలాగే లాక్కెళ్లింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వైపు వెళ్తున్న కారుకు ఓ వ్యక్తి మృతదేహం చిక్కుకుపోయిందని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈరోజు తెలిపారు.

సమాచారం ప్రకారం, కారు ఆగ్రా నుండి నోయిడా వైపు వెళుతుండగా, మధుర మంత్‌లోని టోల్ బూత్ వద్ద భద్రతా సిబ్బంది కారుకు ఒక వ్యక్తి మృతదేహం ఇరుక్కుపోవడం గమనించారు. ఆ సమయంలో కారును ఢిల్లీకి చెందిన వీరేంద్ర సింగ్  నడుపుతున్నాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కారును అక్కడినుంచి వెళ్ళిపోకుండా అడ్డుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బీహార్‌లో వింత దొంగలు.. ఏకంగా రైల్వే ట్రాక్ నే ఎత్తుకెళ్లి.. స్కాప్ కింద అమ్ముకున్నారు..

“నిన్నరాత్రి ఎక్స్‌ప్రెస్‌వే వద్ద దట్టమైన పొగమంచు ఉంది. దీనివల్ల ఎదురునుంచి ఏం వస్తుందో కనిపించే పరిస్థితి లేదు. దీని కారణంగా ఆల్రెడీ ప్రమాదానికి గురైన వ్యక్తి తన కారుకు చిక్కుకుపోవడం అతను గమనించలేదు’ అని అనుమానిత నిందితుడు వీరేంద్ర సింగ్‌ను ఉటంకిస్తూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ దేహత్) త్రిగుణ్ బిసెన్ చెప్పారు. 

వీరేంద్రను విచారిస్తున్నారు. అందుబాటులోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మృతుడి వివరాల కోసం చుట్టుపక్కల ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలియడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. జనవరి 1న ఢిల్లీలో జరిగిన ఘటన నుంచి ఇలాంటి సంఘటనలు క్రమం తప్పకుండా అక్కడక్కడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. 

ఇందులో స్కూటర్ నడుపుతున్న 20 ఏళ్ల అంజలి సింగ్, ఐదుగురు నడుపుతున్న కారు ఢీకొట్టి అనేక కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఆ తరువాత ఆమె వీధిలో శవమై కనిపించింది. ఔటర్ ఢిల్లీలోని కంఝవాలా ప్రాంతానికి చెందిన యువకులుగా గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో కారులో ఉన్న ఐదుగురితో సహా మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు.

click me!