జూలై 1 నుండి అమలులోకి కొత్త క్రిమినల్ చట్టాలు

By SumaBala Bukka  |  First Published Feb 24, 2024, 4:08 PM IST

దేశంలోని వలసరాజ్యాల కాలం నాటి చట్టాల స్థానంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుండి అమల్లోకి వస్తాయని, ప్రభుత్వం శనివారం ప్రకటించింది.


ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో ఈ చట్టాలు అమలవుతాయి. ఈ మూడు క్రిమినల్ చట్టాలకు గానూ శనివారం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

భారతీయ న్యాయసంహిత-2023,, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ సాక్ష్య బిల్లు-2023ai.. 1860 నాటి భారతీయ శిక్షాస్మృతి, 1973 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC), 1872 నాటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. 

Latest Videos

హిందూ విద్యార్థి టీసీలో ‘ముస్లిం’ అని రాసిన టీచర్లు.. బలవంతంగా నమాజ్.. మత మార్పిడికి ప్రయత్నం.

ఈ మూడు బిల్లులకు నిరుడు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. గత డిసెంబర్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన తరువాత చట్టాలుగా మారాయి. ఈ కొత్త చట్టాలు ఉగ్రవాదం, హత్యలు, జాతీయ భద్రతకు హాని కలిగించే నేరాలకు శిక్షలను మరింత కఠినం చేస్తాయి. 

భారతీయ న్యాయ సంహితలో 20కొత్త నేరాలు చేర్చగా, ఐపీసీలో ఉన్న 19 నిబంధనలు తొలగించబడ్డాయి. 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు. 83 నిబంధనలలో జరిమానా శిక్షను పెంచారు. ఆరు నేరాల్లో సమాజసేవను శిక్షగా పెట్టగా, 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్షను ప్రవేశపెట్టారు. 

click me!