కరోనా జేఎన్.1 వైరస్: ప్రజారోగ్యానికి ముప్పుందా? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే?

By narsimha lode  |  First Published Dec 20, 2023, 9:46 AM IST

కరోనా కొత్త వైరస్ జేఎన్.1 గురించి  ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు విషయాలను వెల్లడించింది.ప్రపంచ వ్యాప్తంగా  38 దేశాల్లో ఈ వైరస్ కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. 



న్యూఢిల్లీ: కరోనా కొత్త వైరస్ జేఎన్.1 గురించి కొత్త విషయాలను వెల్లడించింది.  ఈ వైరస్ వల్ల ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అందుబాటులో ఉన్న సాక్ష్యాల మేరకు జేఎన్.1 ద్వారా ప్రజారోగ్యానికి ప్రమాదం తక్కువగానే ఉన్నట్టుగా అంచనా వేయబడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

 కరోనా బీఏ.2.86 వేరియంట్ నుండి జేఎన్.1 వేరియంట్ ఉద్భవించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది.ప్రస్తుతం కరోనాకు  ఇచ్చే వ్యాక్సిన్లు  కరోనా  జేఎన్.1 వైరస్ నుండి రక్షణను ఇవ్వనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Latest Videos

also read:పెరుగుతున్న కరోనా కేసులు: అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

ఈ నెల ప్రారంభంలో  అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ (సీడీసీ) ఏజెన్సీ తాజా అంచనాల మేరకు  డిసెంబర్  8 నాటికి అమెరికాలో  కరోనా కేసుల సంఖ్య  15 నుండి  29 శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

కరోనా జేఎన్.1 వైరస్  ప్రజారోగ్యానికి  ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందనేందుకు  ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవని  సీడీసీ అభిప్రాయపడింది.

అమెరికాలో  ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో  కరోనా జేఎన్.1 వైరస్ గుర్తించారు.  గత వారంలో చైనాలో  కరోనా జేఎన్.1 వైరస్ కేసులు  ఏడు నమోదయ్యాయి.

దేశ వ్యాప్తంగా కూడ  కరోనా  కేసులు పెరుగుతున్నాయి.  కేరళ రాష్ట్రంలో ఈ నెల  8వ తేదీన  ఓ రోగిలో జేఎన్.1 కరోనా వైరస్ ను గుర్తించారు.  కేరళ రాష్ట్రంలో  పలువురు కరోనా బారిన పడ్డారు.  భారత దేశంలో  కరోనాతో  ఐదుగురు మృతి చెందారు.  వీరిలో కేరళ రాష్ట్రానికి చెందిన వారు నలుగురున్నారు. 

సోమవారానికి భారత దేశంలో  1,828 కరోనా కేసులు నమోదయ్యాయి.  ఈ కేసులన్నీ  జేఎన్. 1 కరోనా వైరస్ కు చెందినవిగా అధికారులు  ప్రకటించారు. 

ఈ వైరస్ తో కేరళ రాష్ట్రంలోనే నలుగురు మృతి చెందారు.  అయితే  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది.  జేఎన్.1 కరోనా వైరస్ కారణంగా  అంతగా ప్రమాదం లేదని  కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీనా జార్జ్ చెప్పారు.  కరోనా కేసులతో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.  

కరోనా జేఎన్.1 వైరస్  త్వరగా వ్యాప్తి చెందుతుందని  నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోవిడ్ టాస్క్ ఫోర్స్  కో ఛైర్మెన్  రాజీవ్ జయదేవన్  పేర్కొన్నారు.

జేఎన్.1 కరోనా వైరస్ కేసులు ప్రపంచంలోని 38 దేశాల్లో నమోదయ్యాయి. భారత దేశంలో కూడ ఈ కేసులు నమోదయ్యాయి.  ఈ ఏడాది సెప్టెంబర్ లో  అమెరికాలో ఈ వైరస్ తొలుత వెలుగు చూసింది. ఈ నెల  గత వారంలో  చైనాలో కూడ ఈ కేసులు నమోదయ్యాయి.  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.  కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించింది. 

click me!