Latest Videos

“ప్రతిపక్షాల ప్రధాని ఎవరు ?” ఖర్గే కీలక వ్యాఖ్యలు 

By Rajesh KarampooriFirst Published Mar 1, 2023, 10:56 PM IST
Highlights

విభజన శక్తులకు వ్యతిరేకంగా జరిగే ఈ పోరులో భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎవరు నాయకత్వం వహిస్తారో ? ఎవరు ప్రధానమంత్రి అవుతారో ? తాను ఎప్పుడూ చెప్పలేదని ఖర్గే అన్నారు. 

విభజన శక్తులకు వ్యతిరేకంగా భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడాలని, ప్రతిపక్షాల నుంచి ప్రధాని ఎవరు అవుతారనే విషయాన్ని తాను ఎన్నడూ ప్రస్తవించలేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం నాడు (మార్చి 1) చెన్నైలో డీఎంకే భారీ ర్యాలీ నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఖర్గే ప్రసంగిస్తూ.. 2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల ఐక్యత కోసం పిలుపునిచ్చారు. విభజన శక్తులపై కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షం విజయం సాధించిన తర్వాత దేశానికి నాయకత్వం వహించే ఉత్తమ వ్యక్తిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకోవచ్చని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

దేశాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు. విభజన శక్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్-డీఎంకే కూటమిలోని భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎవరు నాయకత్వం వహిస్తారో, ఎవరు ప్రధాని అవుతారో నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇది ప్రశ్న కాదు. ఐక్యంగా పోరాడాలని, ఇదే మా కోరిక..అని   కీలక ప్రకటన చేశారు.

తమిళనాడులో కాంగ్రెస్-డీఎంకే కూటమి 2004, 2009లో లోక్‌సభ విజయాలను, 2006, 2021లో అసెంబ్లీ విజయాలను సాధించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. యుపిఎ కూటమికి 2024 లోక్‌సభ విజయం కోసం మన కూటమి , నాయకత్వం యొక్క పునాదిని బలోపేతం చేయడం కొనసాగించాలని అన్నారు.

ఎన్నికల ప్రయోజనాల కోసం బీజేపీ  ప్రజలను పోలరైజ్ చేయడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం,నిరుద్యోగంతో బాధపడుతున్నారు. భాజపా ప్రభుత్వ వైఫల్యం వల్ల 23 కోట్ల మందికి పైగా ప్రజలు దారిద్య్రరేఖకు దిగువకు నెట్టబడ్డారని ఖర్గే  ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులు ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నారు, యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారనీ, అయితే ఎన్నికల్లో గెలవడానికి సమాజాన్ని పోలరైజ్ చేయడానికి బిజెపి ఆసక్తి చూపుతోందని విమర్శించారు.

click me!