ఉదారత: ఒక్క ఫోటోతో రూ.57 లక్షలు

By narsimha lodeFirst Published Sep 20, 2018, 5:11 PM IST
Highlights

ఒక్క ఫోటో వందలాది హృదయాలను కదిలించింది. నిరుపేద కుటుంబానికి  ఈ ఫోటో కారణంగా రూ. 57 లక్షలు సమకూరాయి


న్యూఢిల్లీ: ఒక్క ఫోటో వందలాది హృదయాలను కదిలించింది. నిరుపేద కుటుంబానికి  ఈ ఫోటో కారణంగా రూ. 57 లక్షలు సమకూరాయి. ఈ నిధులు ప్రస్తుతం ఆ కుటుంబాన్ని  ఆదుకొన్నాయి. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకొంది.

న్యూఢిల్లీలోని  అనిల్  అనే పారిశుద్య కార్మికుడు విధులు నిర్వహిస్తూ  మృతి చెందాడు.  అతని మృతదేహం వద్ద 11 ఏళ్ల కొడుకు రోధిస్తుండగా  తీసిన ఫోటోను శివ్ సన్నీ అనే ట్విట్టర్ ఖాతాదారుడు పోస్ట్ చేశాడు.

ఈ ఫోటో వైరల్‌గా మారింది.ఈ ఫోటోను సుమారు 31 వేల మంది  ర్ చేసుకున్నారు.దీంతో ఓ క్రౌడ్ ఫండ్ వెబ్ సైట్ లో స్వచ్ఛంద సంస్థ ఒకటి, అతని కుటుంబాన్ని ఆదుకుందామని పిలుపునిచ్చి నిధుల సేకరణ ప్రారంభించింది. 

దీనికి వందలాది మంది స్పందించారు.ఫలితంగా కేవలం రెండు రోజుల వ్యవధిలో రూ. 57 లక్షలు పోగయ్యాయి. అనిల్ కు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఈ మొత్తాన్ని అనిల్ కుటుంబానికి అందిస్తామని స్వచ్ఛంద సంస్థ తెలిపింది.


 

click me!