ప్రభుత్వాస్పత్రిలో దారుణం...రోగులకు పురుగులన్నం పంపిణీ

By Nagaraju TFirst Published Sep 20, 2018, 3:52 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో అతిపెద్ద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన జీబీ పంత్ హాస్పిటల్‌లో దారుణం వెలుగు చూసింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నరోగులకు పురుగులకు అన్నం పెట్టిన ఘటన కలకలం రేపింది. ఓ వార్డులోని రోగులకు సిబ్బంది పంపిణీ చేసిన ఆహారంలో పురుగులు ప్రత్యక్షమవ్వడంతో రోగులు బెంబేలెత్తారు. 

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అతిపెద్ద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయిన జీబీ పంత్ హాస్పిటల్‌లో దారుణం వెలుగు చూసింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నరోగులకు పురుగులకు అన్నం పెట్టిన ఘటన కలకలం రేపింది. ఓ వార్డులోని రోగులకు సిబ్బంది పంపిణీ చేసిన ఆహారంలో పురుగులు ప్రత్యక్షమవ్వడంతో రోగులు బెంబేలెత్తారు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమలేష్ (32) సిబ్బంది ఇచ్చిన అన్నం తింటుండగా పురుగులు కనిపించడంతో భయాందోళన చెందాడు. అదే వార్డులో చికిత్స పొందుతున్న మరో రోగి ఆహారంలోనూ పురుగులు కనిపించాయి. ఇక అన్ని వార్డుల్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. రేష్మ అనే మహిళ తన భర్త తింటున్న అన్నంలో పురుగులు ఉండటంతో తినొద్దని వారించినట్లు తెలిపింది. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గా బ్రెడ్, రైస్, వెజిటబుల్ కర్రీని రోగులకు సిబ్బంది అందించారు. అయితే అన్ని వార్డుల్లో రోగులకు పురుగల అన్నం సరఫరా చెయ్యడంతో వారు ఆసుపత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరపనున్నట్టు అధికారులు తెలిపారు.
 

click me!