రూ. 90,000 కోసం.. మామను చంపి, ముక్కలుగా కోసిన మేనల్లుడు.. ప్లాస్టిక్ కవర్లలో చుట్టి....

Published : Jul 17, 2023, 12:09 PM IST
రూ. 90,000 కోసం.. మామను చంపి, ముక్కలుగా కోసిన మేనల్లుడు.. ప్లాస్టిక్ కవర్లలో చుట్టి....

సారాంశం

తన దగ్గర తీసుకున్న రూ.90వేలు తిరిగివ్వమన్నందుకు.. మామకు టీలో మత్తుమందు కలిపిచ్చి హత్యచేశాడో మేనల్లుడు. ఆ తరువాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ప్లాస్టిక్ కవర్లలో చుట్టి, పాతిపెట్టాడు. 

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో కిరాతకఘటన వెలుగు చూసింది. రూ.90,000 అప్పుకోసం మేనమామను అతికిరాతకంగా హతమార్చాడో మేనల్లుడు. ఆ తరువాత మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి పాలిథిన్ సంచుల్లో గుంతల్లో పూడ్చిపెట్టాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో వెలుగు చూసింది. అప్పుకు సంబంధించిన వివాదంలో 45 ఏళ్ల వ్యాపారవేత్తను అతని మేనల్లుడు దారుణంగా హత్య చేశాడు. రూ.90 వేల అప్పు ఉన్న మృతుడు వివేక్ శర్మ శరీర భాగాలను ఆరు ముక్కలుగా నరికి పాలిథిన్ సంచుల్లో గుంతల్లో పూడ్చిపెట్టారు.

స్నేహితుడితో గడపాలని అర్ధాంగిపై ఒత్తిడి.. అతడి భార్యతో సరసాలాడేందుకు సిద్ధమైన భర్త.. తరువాత ఏమైందంటే ?

గుణ జిల్లాలోని గోపీకృష్ణ సాగర్ డ్యామ్ సమీపంలోని ఓ గొయ్యిలో బాధితుడి శరీరభాగాలు దొరకడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి సమీపంలో అతని ద్విచక్రవాహనం కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మోహిత్  మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. అతను తన మామ దగ్గర రూ.90 వేలు అప్పుగా తీసుకున్నాడు. వాటిని వసూలు చేసేందుకు వివేక్ జూలై 12న ఇంటి నుంచి వెళ్లాడు. 

వివేక్ టీలో డ్రగ్స్ కలిపాడని, దీంతో అతడు అపస్మారక స్థితికి చేరుకున్న తరువాత ఈ దారుణానికి ఒడిగట్టాడు. వివేక్ కు ప్రభుత్వం కేటాయించిన ఇంట్లో మోహిత్, అతని సోదరి ఉంటున్నారు. ఇంటికి వచ్చిన మామను టీలో డ్రగ్స్ కలిపి ఇచ్చి, హత్య చేసిన మోహిత్ మృతదేహాన్ని కత్తితో ఆరు ముక్కలుగా నరికాడు.

గోపీకృష్ణ సాగర్ ఆనకట్ట సమీపంలో మూడు గుంతలు తవ్వి శరీర భాగాలను ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి పూడ్చిపెట్టి పారిపోయాడు. వివేక్ ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెంది అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి మిస్సింగ్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి బాధితుడి ఆచూకీ కోసం సెర్చ్ టీమ్‌ను పంపారు.

మోహిత్‌ను పోలీసులు ప్రశ్నించగా, అతడు వారిని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడని సమాచారం. అయితే, అతడిని గట్టిడా విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివేక్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వివేక్ తల శరీరం నుంచి వేరుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి చేతికి సంకెళ్లు ఉండడం కుటుంబ సభ్యులు గుర్తించారు. బాధితుడి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబీకులు కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ వెలుపల పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వివేక్ తరచూ మోహిత్ ఇంటికి వచ్చేవాడు. నేరం జరిగిన ప్రభుత్వం కేటాయించిన నివాసంలో మోహిత్ సోదరి, అతని బావ మకాం వేశారు. ఈ దారుణ హత్య వెనుక ఉన్న ఇతర కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం