ఒక్కతే మహిళ..27మందిని పెళ్లాడింది, చివరికి...!

Published : Jul 17, 2023, 11:14 AM IST
  ఒక్కతే మహిళ..27మందిని పెళ్లాడింది, చివరికి...!

సారాంశం

ఒకే మహిళ దాదాపు 27మందిని పెళ్లి చేసుకుంది. ఈ  సంఘటన జమ్మూ కశ్మీర్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ మధ్యకాలంలో  పెళ్లి పేరిట మోసం చేసేవారు బాగా పెరిగిపోతున్నారు. మ్యాట్రిమోనీ సైట్స్ లో పరిచయం చేసుకోవడం, తర్వాత లాంఛనంగా, సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకోవడం, కొంతకాలం కాపురం చేసిన తర్వాత ఇంట్లో డబ్బు, బంగారంతో ఉడాయించడం ఇదే కామన్ గా జరుగుతోంది. ఇఫ్పటి వరకు అలా పెళ్లి పేరిట మోస పోయిన అబ్బాయిలు చాలా మందే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఓ ఉదంతమే వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం ఒకే మహిళ దాదాపు 27మందిని పెళ్లి చేసుకుంది. ఈ  సంఘటన జమ్మూ కశ్మీర్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జమ్మూ కశ్మీర్ పరిసర ప్రాంతాలకు చెందిన చాలా మంది యువకులు తమ భార్య కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ ఫిర్యాదులు వచ్చాయి. తీరా, దర్యాప్తు చేయగా, 12మంది యువకులు ఫిర్యాదు చేసింది ఒకే అమ్మాయి గురించి. అనుమానం వచ్చిమరింత లోతుగా ఫిర్యాదు  చేయగా, సదరు మహిళ దాదాపు 27మందిని పెళ్లి చేసుకుందట.

పెళ్లి చేసుకొని కొద్ది రోజులు కాపురం చేయగానే, ఇంట్లో డబ్బు, బంగారంతో ఉడాయించేది. వారంతా తమ భార్య కనిపించడం లేదు అనే భ్రమలో ఉన్నారు కానీ, తమను మోసం చేసింది అని తెలుసుకోలేకపోవడం గమనార్హం. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆమెపై కేసులు నమోదైనట్టు తెలుసుకున్న పోలీసులు ఆ కిలేడీని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం