నీట్ పీజీకౌన్సెలింగ్ (NEET-PG Counselling 2021)కు బ్రేక్ పడింది. ప్రస్తుతానికి నీట్ పీజీ కౌన్సిలింగ్ నిలిపివేయాలన్న సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
నీట్ పీజీకౌన్సెలింగ్ (NEET-PG Counselling 2021)కు బ్రేక్ పడింది. ప్రస్తుతానికి నీట్ పీజీ కౌన్సిలింగ్ నిలిపివేయాలన్న సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల హేతుబద్దతను విచారణ జరుపుతున్నామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. తాము నిర్ణయించే వరకు కౌన్సిలింగ్ నిలిపివేయాలని తెలిపింది. ఓబీసీకి 27 శాతం, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 10 శాతం రిజర్వేషన్ అమలును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకునే వరకు నీట్-పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించబోమని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.
కేంద్రం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) కేఎం నటరాజ్ ఇచ్చిన హామీని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం నమోదు చేసింది. షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగితే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ధర్మాసనం అభిప్రాయపడింది.
undefined
Also read: తెలంగాణ పథకాలు కావాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు.. ఇప్పుడు ఏపీలోనే కరెంట్ ఉండటం లేదు.. కేసీఆర్
ఈ ఏడాది జులై 29న ప్రస్తుత విద్యా సంవత్సం నుంచి నీట్ ఆల్ ఇండియా కోటాలో ఓబీసీకి 27 శాతం, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నోటిఫికేషన్ జారీచేసింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు Supreme Courtలో పిటిషన్ దాఖలు చేశారు. దీని వల్ల జనరల్ కేటగిరీ విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతాయని వారు అన్నారు.
Also read: TRS Plenary: టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
ఇక, పీజీ నీట్ 2021లో అర్హత పొందిన విద్యార్ధులకు నేటి నుంచి(అక్టోబర్ 25) నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. మొదటి రౌండ్ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ , ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ నెల 25 నుంచి 29వ తేదీవరకూ జరపాలని నిర్ణయించారు. అయితే తాజాగా సుప్రీం ఆదేశాలతో కౌన్సిలింగ్‌కు బ్రేక్ పడింది.