హైదరాబాద్‌లో నీరా అమ్మకానికి కేఫ్.. టేక్ అవే ఆప్షన్ కూడా.. నెక్లెస్‌రోడ్‌లో బుధవారం ప్రారంభం

Published : May 01, 2023, 04:21 PM IST
హైదరాబాద్‌లో నీరా అమ్మకానికి కేఫ్.. టేక్ అవే ఆప్షన్ కూడా.. నెక్లెస్‌రోడ్‌లో బుధవారం ప్రారంభం

సారాంశం

హైదరాబాద్‌‌లో నెక్లెస్ రోడ్డులో బుధవారం నీరా కేఫ్‌ను ప్రారంభిస్తున్నారు. ఏడు స్టాల్స్‌తో ఏర్పాటు చేస్తున్న ఈ కేఫ్‌లో నీరా విక్రయిస్తారు. త్వరలోనే టేక్ అవే ఆప్షన్ కూడా అందుబాటులోకి తేనున్నారు.  

హైదరాబాద్: పట్టణ వాసులు పల్లెలకు వెళ్లినప్పుడు చాలా మంది తప్పకుండా తాటి కల్లు లేదా ఈత కల్లు తాగుతారు. సీజన్ బట్టి నీరా కూడా సేవించి తరిస్తారు. ముఖ్యంగా మహిళలు నీరాను ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. పల్లె ప్రకృతిలో తెల్ల కల్లు తాగడాన్ని మధుర అనుభూతిగా భావిస్తారు. పట్టణాల్లో ఉన్నప్పుడు కూడా ఈ అనుభూతిని తెగ మిస్ అవుతుంటారు. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నది. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్‌ను బుధవారం ప్రారంభిస్తున్నది. ఐటీ మినిస్టర్ కేటీఆర్ చేతుల మీదుగా బుధవారం ఈ నీరా కేఫ్ ప్రారంభం కానుంది.

రూ. 13 కోట్లతో ఈ కేఫ్‌ను నిర్మించారు. ఇది స్థానికులకు, టూరిస్టులకు ఒక హాట్‌స్పాట్‌గా మారుతుందని భావిస్తున్నారు. 300 నుంచి 500 వరకు వినియోగదారులను ఈ కేఫ్ మేనేజ్ చేసే కెపాసిటీని కలిగి ఉంటుంది. కేఫ్‌లో ఏడు స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. దీనికి తోడు కేఫ్ నుంచి సాగరంలోని బుద్ధుడి విగ్రహం వద్దకూ వెళ్లడానికి బోట్ వసతిని కల్పిస్తున్నారు.

Also Read: ‘అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తారా?’ ఫ్రాడ్‌లో లక్షలు మోసపోయిన 71 ఏళ్ల వృద్ధుడు

నగరంలో నీరా దొరికే ప్రాంతం ఇదొక్కటే కానుంది. ఇక్కడికి వచ్చి నీరా సేవించాల్సి ఉంటుంది. అయితే, త్వరలోనే టేక్ అవే ఆప్షన్ కూడా అందుబాటులోకి తేనున్నారు. తెల్లకల్లులో నాలుగు శాతం 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌