దలైలామాకు భారతరత్న ఇవ్వండి.. 62 శాతం మంది భారతీయుల మద్ధతు

By Siva KodatiFirst Published Jan 22, 2021, 4:31 PM IST
Highlights

టిబెటిన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించాలని భారతీయులు డిమాండ్ చేశారు. ఐఏఎన్ఎస్ సీ వోటర్ టిబెట్ పోల్‌లో ఈ మేరకు మూడింట రెండొంతుల మంది భారతీయులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

టిబెటిన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించాలని భారతీయులు డిమాండ్ చేశారు. ఐఏఎన్ఎస్ సీ వోటర్ టిబెట్ పోల్‌లో ఈ మేరకు మూడింట రెండొంతుల మంది భారతీయులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 62.4 శాతం మంది దలైలామాకు భారతరత్న ఇవ్వాలని కోరారు. కేవలం 21.7 శాతం మంది మాత్రమే దీనిని వ్యతిరేకించారు. ఇక వయసుల వారీగా వస్తే... 55 అంతకంటే వయసున్న వారిలో 73.1 శాతం మంది దలైలామాకు అండగా నిలిచారు.

ప్రాంతాలవారీగా వస్తే 67.6 శాతం మంది ఉత్తర భారతీయులు ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరారు. దలైలామాను ఆధునిక భారతదేశం యొక్క సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రభావకర్తగా మూడింట రెండొంతుల మంది అభిప్రాయపడ్డారు.

నిజానికి దలైలామాను ఒక విదేశీయుడిగా కాకుండా భారతీయ ఆధ్యాత్మిక నాయకుడిగా పరిగణించాలని ఎక్కువమంది సూచిస్తున్నారు. ఈ సర్వే గొప్ప విజయంగా పరిగణించబడుతున్నప్పటికీ, మరోవైపు చైనాతో దూకుడుగా వ్యవహరించకపోవడం దలైలామా టిబెటిన్ బ్రాండ్ గుర్తింపును తక్కువ చేసిందని కూడా సర్వే తెలిపింది.

ఏది ఏమైనప్పటికీ అత్యధికులు మాత్రం భారతరత్న పురస్కారాన్ని దలైలామాకు ఇవ్వడానికి మద్ధతు ఇస్తున్నారు. టిబెన్‌లో మానవ హక్కుల సమస్య నేపథ్యంలో చైనాతో సంబంధాలను తెంచుకోవడానికి భారతీయులు సిద్ధంగా వున్నారు.

దాదాపు మూడింట రెండొంతుల మంది ఇండియన్స్ చైనాతో సంబంధాలను తగ్గించుకోవడం ద్వారా టిబెట్ సమస్యకు మద్ధతు ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు. చైనా బ్రాండ్ ఈక్విటీ గతేడాది కాలంగా తగ్గిపోయింది.

అదే సమయంలో ఎక్కువ మంది భారతీయులు చైనా వ్యతిరేకులుగా మారారు. దాదాపు 80% మంది భారతీయులు టిబెట్‌ స్వాతంత్య్రానికి మద్దతు ఇస్తున్నారు. సర్వేలో కేవలం పది బేసి ప్రశ్నలు ఇవ్వడంతో పాటు 5 నిమిషాల పాటు చర్చకు అనుమతించారు. 

click me!