దీదీకి మరో షాక్: మంత్రి పదవికి రాజీవ్ బెనర్జీ రాజీనామా

Published : Jan 22, 2021, 03:14 PM IST
దీదీకి మరో షాక్: మంత్రి పదవికి రాజీవ్ బెనర్జీ రాజీనామా

సారాంశం

: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమత బెనర్జీకి మరో మంత్రి షాకిచ్చారు. అటవీశాఖ మంత్రి రాజీవ్ బెనర్జీ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమత బెనర్జీకి మరో మంత్రి షాకిచ్చారు. అటవీశాఖ మంత్రి రాజీవ్ బెనర్జీ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా రాజీవ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.  త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీకి దూరమౌతున్నారు. టీఎంసీని వీడి ఎక్కువ మంది నేతలు బీజేపీలో చేరుతున్నారు.

అటవీ శాఖ మంత్రి కొంత కాలంగా పార్టీ తీరుపై ఆయన అసంతప్తితో ఉన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా టూర్ బెంగాల్ లో పర్యటించనున్నారు. ఈ తరుణంలో అటవీశాఖ మంత్రి రాజీనామా చేయడం రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది. రాజీవ్ కూడ బీజేపీ చేరుతారనే ప్రచారం  సాగుతోంది.

మమతకు కీలకమైన మద్దతుదారుగా ఉన్న సువేంధు అధికారి బీజేపీలో చేరారు. నందిగ్రామ్ ఉద్యమంలో సువేంధు కీలక పాత్ర పోషించారు. సువేంధుతో పాటు ఏడుగురు టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

EPI 2024 లో అద్భుత ర్యాంకు సాధించిన యూపీ.. అసలు ఇదేమిటో తెలుసా?
Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !