జూన్‌లోపుగా ఎఐసీసీకి కొత్త అధ్యక్షుడు: సీడబ్ల్యూసీ కీలక నిర్ణయం

By narsimha lodeFirst Published Jan 22, 2021, 3:34 PM IST
Highlights

ఈ ఏడాది జూన్  మాసంలో ఎఐసీసీ అధ్యక్షుడి ఎన్నుకోవాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకొంది.
 

ఈ ఏడాది జూన్  మాసంలో ఎఐసీసీ అధ్యక్షుడి ఎన్నుకోవాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకొంది.కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం శుక్రవారం నాడు జరిగింది.  ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించారు.

ఎఐసీసీ అధ్యక్షుడి ఎన్నికను ఈ ఏడాది జూన్ లోపుగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ లోపుగా పలు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై  సీడబ్ల్యూసీలో చర్చించారు.  త్వరలోనే తమిళనాడు, బెంగాల్, తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో  సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.  సోనియాగాంధీ స్థానంలో కొత్త నాయకుడిని ఎన్నుకోనున్నారు. గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కూడ సంస్థాగత ప్రక్రియ పూర్తి చేయాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. 

గతంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కొందరు పార్టీ సీనియర్లు పార్టీ పరిస్థితిపై 21 పేజీల లేఖను సోనియాాగాంధీకి రాశారు. అసమ్మతి నేతలు పార్టీ నాయకత్వం తీరుపై ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. 

click me!