మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేశారు. ఈ వ్యవహరం వెనుక ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సతీమణి ప్రతిభా చక్రం తిప్పినట్టుగా సమాచారం.
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ మంగళవారం నాడు రాజీనామా చేశారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడం వెనుక ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సతీమణి ప్రతిభా పవార్ చక్రం తిప్పారు.
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భార్య ప్రతిభా , ఆయన కూతురు సుప్రియా సూలే అజిత్ పవార్తో చర్చించారు. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడంలో ఇదే కీలక పాత్ర పోషించినట్టుగా సమాచారం.
undefined
Also read:ఫడ్నవీస్‌కు షాక్: డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తన కూతురు సుప్రియా సూలేను రాజకీయంగా ప్రమోట్ చేయడంపై అజిత్ పవార్ కొంత అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం సాగింది.ఈ తరుణంలోనే అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపినట్టుగా ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే సోమవారం నుండి తాను అజిత్ పవార్ తో మాట్లాడలేదని శరద్ పవార్ ప్రకటించారు. ఇదే సమయంలో అజిత్ పవార్ తో శరద్ పవార్ కుటుంబసభ్యులు చర్చలు జరిపారు.
ఎన్సీపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేలంతా తన వెంట ఉన్నారని అజిత్ పవార్ తొలుత ప్రకటించారు. కానీ 51 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా శరద్ పవార్ వైపు వచ్చారు. అజిత్ పవార్ వెంట ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.మరోవైపు ఈ నెల 27వ తేదీన అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకొంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ధీమాను వ్యక్తం చేశారు.