సాగు చట్టాలు.. కేంద్రం వాటిని రద్దు చేయక్కర్లేదు: శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 1, 2021, 5:21 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొన్ని నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మోడీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొన్ని నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మోడీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన సాగు చట్టాలను పూర్తిగా తిరస్కరించే బదులు, ఇబ్బందిగా ఉన్న వాటిని సవరిస్తే సరిపోతుందని పవార్ కేంద్రానికి సూచించారు. ఇలా చేస్తే రైతులకు మేలు చేసిన వారవుతారని ఆయన అన్నారు.

Also Read:సాగు చట్టాలు.. 300 మంది రైతులు మృతి, 2 నిమిషాలు మౌనం పాటించలేరా: రాహుల్

మహారాష్ట్ర మంత్రుల బృందం కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్లోని వివిధ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందని పవార్ పేర్కొన్నారు. రైతుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర సర్కార్ తీర్మానం చేస్తుందా? అన్న మీడియా ప్రశ్నకు పవార్ స్పందిస్తూ.... ‘‘చట్టాలను పూర్తిగా తిరస్కరించే బదులు... రైతులకు ఇబ్బంది ఉన్న వాటిని సవరించవచ్చన్నారు. సాగు చట్టాలపై అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన తర్వాతే అసెంబ్లీ ముందుకు తీర్మానాన్ని తెస్తాం అని శరద్ పవార్ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాలు ఈ చట్టాలను ఆమోదించే బదులు, వివాదాస్పదంగా మారిన అంశాలపై అధ్యయనం చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు
 

click me!