
NCERT పాఠ్య పుస్తకాల మార్పులు: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. 12వ తరగతికి సంబంధించిన హిస్టరీ, సివిక్స్,హిందీ సిలబస్‌లో పలు మార్పులు చేసింది. అయితే.. ఈ మార్పులు గత సంవత్సరమే చేయబడ్డాయి. కానీ.. కరోనా కారణంగా పుస్తకాలను ముద్రించలేకపోయారు. ప్రస్తుతం ఈ అకాడమిక్ ఇయర్ లో పుస్తకాలను ముద్రించి, మార్కెట్లోకి తీసుకరానున్నారు. NCERT ప్రకారం.. సిలబస్‌లో మార్పు అనేది దేశవ్యాప్తంగా NCERT పుస్తకాలు బోధిస్తున్న అన్ని పాఠశాలలకు వర్తిస్తుందని వెల్లడించింది.ఈ మార్పులు రానున్న విద్యా సంవత్సరం(2023-24)నుండి అమలు కానున్నాయి. దానిలో కొన్ని మార్పులు జరిగాయి. ఇప్పటికే తొలిగించిన వాటిపై చర్య జరుగుతోంది. తాజాగా పలు కీలక పాఠ్యాంశాలను కూడా తొలగించినట్టు తెలుస్తుంది.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. మహాత్మా గాంధీ, నాథూరామ్ గాడ్సేకి సంబంధించిన పలు విషయాలు కూడా పుస్తకం నుండి తొలగించబడినట్టు తెలిపారు. అయితే.. గతేడాది జూన్‌లో ఎన్‌సీఈఆర్‌టీ అధికారికంగా విడుదల చేసిన జాబితాలో వీరి తొలగింపు ప్రస్తావన లేదు. అయితే..ఇప్పుడు మార్కెట్లలో విడుదల కానున్న కొత్త పుస్తకాలలో ఈ గాంధీజీ, గాడ్సేకి సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించబడినట్టు తెలుస్తోంది.
ఏఏ అంశాలు తీసివేయబడ్డాయి
అలాగే.. NCERT పాఠ్యపుస్తకాలలోని గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ప్రస్తావనను 11వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకం 'అండర్‌స్టాండింగ్ సొసైటీ' నుండి తొలగించబడింది.
మతం , జాతి తరచుగా నివాస ప్రాంతాల విభజనకు ఎలా దారితీస్తుందనే దాని గురించి మాట్లాడే ఒక పేరాను NCERT తొలగించింది. 2002లో గుజరాత్‌లో మతపరమైన హింస ఎలా దారితీస్తుందో వివరించడానికి మత హింసను ఉదహరించింది. 12వ తరగతి చరిత్ర పుస్తకంలోని 'థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ III'లో, కౌన్సిల్ గాడ్సేకి సంబంధించిన "బ్రాహ్మణ" సూచనను తీసివేసి, అతను "ఒక అతివాద హిందూ వార్తాపత్రికకు సంపాదకుడు" అని పేర్కొంది.
కొత్త పాఠ్యపుస్తకంలో తొలగించబడిన సారాంశాలు:
"హిందువులు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకునేవారు లేదా భారతదేశాన్ని హిందువు దేశంగా మారాలని కోరుకునే వారు గాంధీజీని ప్రత్యేకంగా ఇష్టపడరు. పాకిస్తాన్ ముస్లింలకు ఉన్నట్లే..భారత్ హిందూవులకు ఉండాలని కోరుకున్నారు. హిందూ-ముస్లిం ఐక్యత కోసం గాంధీజీ దృఢ సాధన చేస్తుంటే.. హిందూ తీవ్రవాదులు అతన్ని ఎంతగా రెచ్చగొట్టారు. వారు గాంధీజీని హత్య చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. దేశంలోని మతపరమైన పరిస్థితులపై గాంధీజీ మరణం దాదాపు మాయా ప్రభావాన్ని చూపింది.
మత విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న సంస్థలపై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంటి సంస్థలు కొంతకాలం నిషేధించబడ్డాయి…” అంతేకాకుండా.. NCERT 12వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకం నుండి గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను "పుణేకు చెందిన బ్రాహ్మణుడు"."ముస్లింలను మభ్యపెట్టేవాడు" అని గాంధీజీని నిందించిన అతివాద హిందూ వార్తాపత్రిక సంపాదకుడు అని వివరించిన భాగాన్ని కూడా తొలగించిబడ్డాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
ఇంకా ఏమి తీసివేయబడింది?
వాస్తవానికి.. పిల్లల భారాన్ని తగ్గించడానికి NCERT గత సంవత్సరం అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను మార్చింది. అలాగే.. సిలబస్‌ను త్వరగా కవర్ చేసుకునేందుకు వీలుంటుందని ఎన్‌సీఈఆర్‌టీ తెలిపింది. హిందీ పుస్తకం నుండి కొన్ని కవితలు , పేరాలు కూడా తొలగించబడ్డాయి. మొఘల్ కాలం నాటి పాలకుల చరిత్ర, చరిత్ర ఆధారంగా ఉన్న అధ్యాయాలను థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్ II అనే అనే పాఠ్యాంశాన్ని పుస్తకం నుండి తొలగించారు. 'ప్రపంచ రాజకీయాలలో అమెరికన్ ఆధిపత్యం , ప్రచ్ఛన్న యుద్ధ యుగం' వంటి పాఠాలను పౌరశాస్త్రం పుస్తకం నుండి పూర్తిగా తొలగించారు.
ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ఏం చెప్పారు?
జూన్ 2022లో విడుదల చేసిన అధికారిక ఎన్‌సిఇఆర్‌టి పత్రంలో మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన మార్పులు ఎందుకు రాలేదని అడిగినప్పుడు, ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్ డిఎస్ సక్లానీ మాట్లాడుతూ.. ఈసారి "ఏమీ కొత్తది కాదు" అని అన్నారు. గత ఏడాది మార్పులు జరిగాయి. ఈసారి కొత్తగా చేసిందేమీ లేదని అన్నారు. అదే సమయంలో NCERT సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అధిపతి AP బెహెరా మాట్లాడుతూ.. 'తనిఖీ కారణంగా కొన్ని విషయాలు టేబుల్ నుండి వదిలివేయబడి ఉండవచ్చు, కానీ ఈ సంవత్సరం కొత్త మార్పులు చేయలేదు. ఇదంతా గతేడాది జరిగిందని తెలిపారు.