పీకల్లోతు కష్టాల్లో రకుల్ ప్రీత్ సింగ్: సమన్ల జారీకి ఎన్సీబీ రెడీ

Published : Sep 12, 2020, 12:06 PM IST
పీకల్లోతు కష్టాల్లో రకుల్ ప్రీత్ సింగ్: సమన్ల జారీకి ఎన్సీబీ రెడీ

సారాంశం

సుశాంత్ రాజ్ పుత్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి విచారణలో తన పేరు బయటపడడంతో రకుల్ ప్రీత్ సింగ్ పీకల్లోతు కష్టాల్లో మునిగారు. రకుల్, సారా అలీఖాన్ లతో పాటు మరి కొంత మందికి ఎన్సీబీ సమన్లు జారీ చేయనుంది.

ముంబై: తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు సమన్లు జారీ చేయడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు నటి సారా అలీఖాన్, డిజైనర్ సిమోన్ ఖంబట్టా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ రోహిణి అయ్యర్, ఫిల్మ్ మేకర్ ముకేష్ ఛాబ్రాలకు ఎన్సీబీ సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఎన్సీబీ విచారణలో రియా చక్రవర్తి 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లను వెల్లడించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రియా వెల్లడించిన పేర్లలో ఆ ఐదుగురి పేర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వారు డ్రగ్స్ తీసుకున్నట్లు రియా చక్రవర్తి వెల్లడించారు. 

Also Read: రకుల్‌ ఇలా బుక్కయ్యిందేంటి?.. షాక్‌లో అభిమానులు

బాలీవుడ్ పార్టీల్లో వారు డ్రగ్స్ తీసుకున్నట్లు రియా చక్రవర్తి ఎన్సీబీ అధికారుల ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎన్సీబీ అధికారులు 15 మంది బాలీవుడ్ ప్రముఖులపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. 

ఎన్సీబీ అధికారులు శనివారంనాడు ముంబై, గోవాల్లోని ఎనిమిది ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి సంబంధించిన కేసులో వారు ఈ దాడులు నిర్వహించారు. రియా చక్రవర్తి గోవాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. 

Also Read: డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సహా మరో 24 మంది పేర్లు బయటపెట్టిన రియా

పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడి అవుతున్న నేపథ్యంలో ఎన్సీబీ ఉన్నత స్థాయి సమావేశం ముంబైలోని కార్యాలయంలో ఈ సాయంత్రం జరగనుంది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ఎన్సీబీ ఖరారు చేసుకుంటుంది.

PREV
click me!

Recommended Stories

పూరి జగన్నాథ రథయాత్రలో అద్భుత దృశ్యాలు | Puri Jagannath Rath Yatra 2026 Lord Jagannath from Puri
వివాహేతర సంబంధం నేరం కాకపోతే.. హోటళ్లలో పోలీసుల దాడులు ఎందుకు? అసలు చట్టం ఏం చెబుతోంది?