ఒకే మహిళను మూడుసార్లు కాటేసిన పాము

Published : Sep 12, 2020, 10:29 AM IST
ఒకే మహిళను మూడుసార్లు కాటేసిన పాము

సారాంశం

పాము కాటుకు మంత్రం వేస్తామని చెప్పుకునే 8 మంది మంత్రగాళ్లను ఇంటికి పిలిపించి, రాత్రంతా పూజలు చేయించారు. ఈ ఉదంతాన్ని కొందరు వీడియో తీశారు.

ఇటీవల ఓ యువకుడిని ఒకే పాము ఎనిమిది సార్లు కాటేసిన వార్త చదివే ఉంటారు. ఆ యువకుడు ఎక్కడికి వెళ్తే.. ఆ పాము అక్కడకు వెళ్లి మరీ కాటు వేసింది. తాజాగా.. ఇలాంటి సంఘటన ఓ యువతికి కూడా ఎదురైంది. ఓ యువతిని ఓ పాము వరసగా మూడుసార్లు కాటువేసింది. దీంతో.. మళ్లీ ఆ పాము సదరు యువతి జోలికి రాకుండా ఉండేందుకు మంత్రగాళ్లను పలిపించి మరీ పూజలు చేయించారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని భరత్ పూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ లోని మథురా గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్ కాలనీకి చెందిన సప్నా దేవి అనే యువతిని మూడుసార్లు పాము కాటువేసింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను జిల్లా ఆర్బీఎం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అక్కడి వైద్య సిబ్బందికి సప్నా దేవి శరీరంపై పాము కాటువేసిన గుర్తులేవీ కనిపించలేదు. 

దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చేశారు. తరువాత పాము కాటుకు మంత్రం వేస్తామని చెప్పుకునే 8 మంది మంత్రగాళ్లను ఇంటికి పిలిపించి, రాత్రంతా పూజలు చేయించారు. ఈ ఉదంతాన్ని కొందరు వీడియో తీశారు. ఈ సందర్భంగా బాధితురాలు సప్నా మాట్లాడుతూ ఒక పాము తనను మూడుసార్లు కాటువేసిందని, తరువాత అది కనిపించకుండా పోయిందని తెలిపారు. అయితే ఆమెను పరిశీలించిన వైద్యులకు ఆమె శరీరంపై పాము కాటు గుర్తు కనిపించలేదు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు మంత్రగాళ్లను ఇంటికి పిలిపించి రాత్రంతా భారీ ఎత్తున పూజలు నిర్వహించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. 

PREV
click me!

Recommended Stories

డాలర్లు వస్తాయి కానీ... అమెరికాలో అందరి బతుకూ ఇదే! | US vs India Minimum Wage | Asianet News Telugu
తమిళనాడు బడ్జెట్ విజయ్ ఆసక్తికర కేటాయింపులు | Tamil Nadu CM Vijay Mega Budget 2026