సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పై రగిలిన వివాదం అందరికీ తెలిసిందే. అనేక మలుపులు తిరుగుతున్న ఈ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన విషయం విదితమే. 

రియా చక్రవర్తిని ఇన్వెస్టిగేట్ చేసిన సందర్భంలో డ్రగ్స్ తీసుకున్న దాదాపు 25 మంది బాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లను ఆమె బయటపెట్టినట్టు తెలియవస్తుంది. అందులోంచి ముగ్గురి పేర్లు బయటకొచ్చాయి. ఇందులో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

రియా చక్రవర్తి బయటపెట్టిన పేర్లలో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్నట్టు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు మరో హీరోయిన్ సారా అలీఖాన్, సెలబ్రిటీ డిజైనర్ సిమోన్ ఖంబాటాల పేర్లు బయటకు వచ్చాయి. 

ముగ్గురు పేర్లు బయటకు రావడం, పూర్తిగా 25 మంది పేర్లు ఉన్నట్టు చెప్పడంతో.... ఇప్పుడు బాలీవుడ్ లో ఆందోళన నెలకొంది. ఇంకెవరెవరి పేర్లు ఇందులో ఉన్నాయో అర్థం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. 

ఇప్పటికే సిమోన్ ఖంబాటా తో రియా చక్రవర్తి డ్రగ్స్ కి సంబంధించి చేసిన చాట్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి చార్టెడ్ ప్లేన్ లో సారా అలీ ఖాన్ బ్యాంకాక్ వెళ్లిన ఆధారాలు కూడా బయటకు వచ్చిన విషయం విదితమే. అధికారుల విచారణలో రియా చక్రవర్తి రకుల్ ప్రీత్ సింగ్ పేరును బయటపెట్టినట్టు తెలియవస్తుంది. 

సారా అలీ ఖాన్, సిమోన్ ఖంబాటా, తాను కలిసి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి మాదక ద్రవ్యాలు సేవించమని రియా చక్రవర్తి అధికారుల వద్ద ఒప్పుకున్నట్టుగా తెలియవస్తుంది. ఇది ఏ ఒక్కసారికో పరిమితం అవలేదని, తరచుగా కూర్చొని మాదక ద్రవ్యాలు సేవించేవారమని తెలిపినట్టు తెలియవస్తుంది.