సీఎం సోదరుడి అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు

By narsimha lodeFirst Published Mar 28, 2019, 10:43 AM IST
Highlights

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు రేవణ్ణ అనుచరుల ఇళ్లలో గురువారం  నాడు ఐటీ  దాడులు జరిగాయి.

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు రేవణ్ణ అనుచరుల ఇళ్లలో గురువారం  నాడు ఐటీ  దాడులు జరిగాయి.

రాష్ట్రంలోని హసన్, మాండ్యా, మైసూర్‌లలో సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ముగ్గురు కాంట్రాకర్టు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇళ్లలో కూడ  అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

జేడీఎస్ ఎమ్మెల్సీ ఫరూక్, మంత్రి పుత్తా ఇంట్లో కూడ ఐటీ సోదాలు సాగిస్తున్నారు.గురువారం నాడు ఉదయం నుండి ఐటీ అదికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  
కర్ణాటక రాష్ట్రంలో ఈఈలుగా పని చేస్తున్న నారాయణరెడ్డి, ఆశ్వత్ నారాయణ, రాయగౌడల ఇళ్లలో కూడ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం గమనార్హం.

రోడ్ల కాంట్రాక్టర్లపై కొందరు ఫిర్యాదు చేయడంతో ఐటీ సోదాలు సాగుతున్నాయని ప్రచారం సాగుతోంది. ఎన్నికల సమయంలో  కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ సోదరుడి అనుచరుల ఇళ్లలో సోదాలు సాగడం రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకొంది. కర్ణాటక రాష్ట్రంలో ఐటీ దాడుల నేపథ్యంలో ప్రధాని మోడీని ఉద్దేశించి సీఎం కుమారస్వామి విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. 


 

click me!