ముదిరిన వివాదం.. ఫ‌డ్న‌వీస్‌కు న‌వాబ్ మాలిక్ అల్లుడు నోటీసులు, క్షమాపణలు చెప్పాలని డిమాండ్

By Siva KodatiFirst Published Nov 11, 2021, 2:35 PM IST
Highlights

మ‌హారాష్ట్ర (maharashtra) మంత్రి న‌వాబ్ మాలిక్ (nawab malik) , ఆ రాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ (devendra fadnavis) మ‌ధ్య కొన్ని రోజులుగా మాట‌ల యుద్దం నడుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తమపై చేసిన వ్యాఖ్యలకు గాను రూ.5 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం కోరుతూ ఫ‌డ్న‌వీస్‌కు లీగల్ నోటీసులు ఇచ్చినట్టు న‌వాబ్ మాలిక్ తెలిపారు.

మ‌హారాష్ట్ర (maharashtra) మంత్రి న‌వాబ్ మాలిక్ (nawab malik) , ఆ రాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ (devendra fadnavis) మ‌ధ్య కొన్ని రోజులుగా మాట‌ల యుద్దం నడుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తమపై చేసిన వ్యాఖ్యలకు గాను రూ.5 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం కోరుతూ ఫ‌డ్న‌వీస్‌కు లీగల్ నోటీసులు ఇచ్చినట్టు న‌వాబ్ మాలిక్ తెలిపారు. ఆయన అల్లుడు స‌మీర్ ఖాన్ ఈ లీగల్ నోటీసులు ఇచ్చిన‌ట్లు వివ‌రించారు.

ఇందుకు సంబంధించిన కాపీని మాలిక్ కూతురు నీలోఫ‌ర్ మాలిక్ ఖాన్ (nilofer malik khan) మీడియాకు విదుడల చేశారు. లాయ‌ర్ రెహ్మాత్ అన్సారీ ద్వారా ఆ నోటీసులు పంపిన‌ట్లు ఆమె వివ‌రించారు. జ‌న‌వ‌రి 13న స‌మీర్ ఖాన్‌ను (sameer khan) ఎన్సీబీ (ncb) అధికారులు డ్ర‌గ్ కేసులో అరెస్టు చేసి, సెప్టెంబ‌రు 27న విడుద‌ల చేశారు. దాన్ని గుర్తు చేస్తూ మాలిక్ అల్లుళ్లు డ్ర‌గ్స్‌తో దొరికార‌ని దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై మాలిక్ అల్లుళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎన్సీబీ దాఖ‌లు చేసిన చార్జీషీట్‌లో త‌మ‌పై ఎటువంటి ఆరోప‌ణ‌లు లేవ‌ని గుర్తుచేశారు. త‌మ ఇంట్లో ఎలాంటి మాద‌క ద్ర‌వ్యాలు దొర‌క‌లేద‌ని వారు అన్నారు. త‌మ‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆ లీగ‌ల్ నోటీసులో మాలిక్ అల్లుడు స‌మీర్ ఖాన్ పేర్కొన్నారు. ఫ‌డ్న‌వీస్ స్పంద‌న కోసం ఎదురుచూస్తున్నామ‌ని ఆయన తెలిపారు. మాజీ సీఎం స్పందించిన త‌ర్వాత త‌దుప‌రి చ‌ర్య‌లు ప్రారంభిస్తామ‌ని మాలిక్ కూతురు స్పష్టం చేశారు. ఫ‌డ్న‌వీస్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుంటే, తాము న‌ష్ట‌ప‌రిహారం దావాతో కోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు.

Also Read:అండర్‌వరల్డ్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ కథ రేపు చెబుతా.. హైడ్రోజన్ బాంబే వేస్తా.. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్

అంకుముందు నవాబ్ మాలిక్‌కు Underworldతో సంబంధాలున్నాయని దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. అంతేకాదు, దీపావళి తర్వాత ఈ విషయాలను వెల్లడి చేస్తానని అన్నారు. దీపావళి తర్వాత తాను బాంబు వేస్తానని చెప్పారు. అండర్‌వరల్డ్  మనుషులతో, 1993 ముంబయి సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కేసులో దోషులతో ఆయన ఓ డీల్ కుదుర్చుకుని ఆస్తి కొనుగోలు చేశారని ఫడ్నవీస్ ఆరోపించారు. మార్కెట్ రేట్ కంటే చౌకగా ఈ ఆస్తి కొనుగోలు చేశారని అన్నారు. 

ఈ ఆరోపణలకు నవాబ్ మాలిక్ కౌంటర్ ఇచ్చారు. తనకు అండర్‌వరల్డ్‌తో లింక్‌లు లేవని, కానీ, దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఉన్నాయని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడూ వాటిని కొనసాగించారని తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాను హైడ్రోజన్ బాంబు వేస్తారని, ఓ ప్రెస్ మీట్ పెట్టి అండర్‌వరల్డ్‌తో దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఉన్న సంబంధాలను వెల్లడి చేస్తానని స్పష్టం చేశారు.

click me!