అమరీందర్ సింగ్‌కు చెక్.. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నవజోత్ సింగ్ సిద్దూ..?

By Siva KodatiFirst Published Jul 15, 2021, 4:26 PM IST
Highlights

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో అంతర్గత విభేదాలకు ముగింపు పలికేందుకు పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా అమరీందర్ ను సీఎంగా కొనసాగిస్తూనే... సిద్దూకి పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎట్టకేలకు మొద్దు నిద్ర వీడినట్లుగా తెలుస్తోంది. పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టిన పెద్దలు.. ప్రజాకర్షణ వున్నవారితో పాటు యువతకు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే తెలంగాణ పీసీసీ చీఫ్‌గా సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించింది. ఇక త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో సైతం.. యువతకు ప్రాథాన్యం కల్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

దీనిలో భాగంగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు, సిద్దూకు మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్ర తరమవుతున్నాయి.  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో అంతర్గత విభేదాలకు ముగింపు పలికేందుకు పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Also Read:పంజాబ్ లో పవర్ కట్.. అమరీందర్ సింగ్ పై సిద్దూ ఘాటు విమర్శలు..

అమరీందర్ ను సీఎంగా కొనసాగిస్తూనే... సిద్దూకి పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇదే సమయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇద్దరిని నియమించబోతున్నారు. వీరిలో ఒకరు దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, మరొకరు హిందువు అని తెలుస్తోంది. ఈ మార్పులతో పంజాబ్ కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న విభేదాలు సమసిపోతాయా? లేదా? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది

click me!