'మహిళల గౌరవం కోసం సాగుతున్న పోరాటమిది': రెజ్లర్లకు నవజ్యోత్ సిద్ధూ మద్దతు

Published : May 01, 2023, 02:48 PM IST
 'మహిళల గౌరవం కోసం సాగుతున్న పోరాటమిది': రెజ్లర్లకు నవజ్యోత్ సిద్ధూ మద్దతు

సారాంశం

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసనలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోమవారం రెజ్లర్లతో కలిసి పాల్గొన్నారు. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌పై వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. 

ఢిల్లీ రెజ్లర్ల నిరసన: లైంగిక వేధింపుల ఆరోపణలో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు.  గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న అగ్ర శ్రేణి రెజ్లర్లకు మద్దతు ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 9 మంది ప్రముఖ మహిళలు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడలేదనీ, ఇది భారత చరిత్రలో కన్నీటి ఘట్టమని అన్నారు.

ఏ దేశమైనా తమ ఐకాన్‌ను అవమానిస్తే.. ఆ దేశ గౌరవం దెబ్బతింటుందని, ఈ మహిళా క్రీడాకారులు దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడమే కాకుండా కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలను నేరవేర్చాలని అన్నారు. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం భారతదేశ గర్వాన్ని దెబ్బతీయడమేనని సిద్ధూ అన్నారు. మన దేశంలోని పెద్ద వ్యక్తులకు చట్టాలు అతీతంగా ఉంటాయనడానికి ఇదొక ఉదాహరణ అనీ, స్త్రీలను అగౌరవపరిస్తే.. ముందు తరాలు కూడా వణికిపోవాలా చట్టాలు రూపొందించాలని అన్నారు.  దేశానికి అత్యున్నత గౌరవం, కీర్తిని తెచ్చిన మహిళలను ఇంత నీచంగా ప్రవర్తిస్తే, సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలా?” అని ఆయన ప్రశ్నించారు.

రెజ్లర్లకు మద్దతుగా ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. అథ్లెట్లు న్యాయం కోసం రోడ్డుపై కూర్చోవడం బాధాకరమన్నారు. తన కృషితో దేశం గర్వించేలా చేశారు. మల్లయోధులతో ఇలాంటి వ్యవహారం చాలా సున్నితమైనది.. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వారికి న్యాయం జరగాలని అన్నారు. బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ రెజ్లర్లలకు మద్దతుగా నిలిచారు. ఆమె మాట్లాడుతూ.. దేశానికి అవార్డులు, పతకాలు సాధించిన మన దేశపు ఆడపడుచులు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగుతున్నారు. ఎక్కడ మహిళలకు దేవత(ఉన్నత) హోదా లభిస్తుందో అక్కడ తమకు న్యాయం జరుగుతోందని అన్నారు.  

సాక్షి మాలిక్, బజరంగ్ పునియా సహా దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆరు రోజుల తర్వాత.. ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 28న బ్రిజ్ భూషణ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. పోలీసుల ప్రకారం.. మొదటి ఎఫ్‌ఐఆర్ పోక్సో కింద నమోదు చేయబడింది.రెండవ ఎఫ్‌ఐఆర్ దౌర్జన్యానికి సంబంధించిన సంబంధిత సెక్షన్ల కింద నమోదు చేయబడింది. ఆదివారం సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, WFI చీఫ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్‌తో సహా మహిళా రెజ్లర్‌లకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించారు. ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టేందుకు వీలుగా ఫిర్యాదుదారులు తమ వాంగ్మూలాలను కూడా త్వరగా నమోదు చేయాలని కోరినట్లు అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!