నవీ ముంబై సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. 35 ఏళ్ల వ్యక్తి తన మైనర్ సవతి కుమార్తెపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఆ కామాంధుడి చెర నుంచి బయటపడ్డ ఆ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది
సమాజంలో రోజురోజుకూ మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. ఆడవారిపై కామాంధుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా .. ఆడపిల్ల కనిపిస్తే చాలు మ్రుగాళ్లలా పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. వావివరసలు మరిచి అత్యాచాలకు పాల్పడుతున్నారు. ఇలా నిత్యం ఏదో ఒకచోట ఆడవారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఎన్ని కఠినతర చట్టాలు అమల్లోకి వచ్చినా.. ఎంత దారుణ చట్టాలు విధించినా.. కీచకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పరువు పోతుందని వెలుగులోకి రాని కేసులు ఎన్నో.
తాజాగా నవీ ముంబై సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. 35 ఏళ్ల వ్యక్తి తన మైనర్ సవతి కుమార్తె (15)పై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఆ కామాంధుడి చరలో నుంచి బయటపడ్డ ఆ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 15 ఏళ్ల బాధితురాలు వాషిలోని ఏపీఎంసీ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారి మాట్లాడుతూ.. 'అక్టోబర్ 2021 మరియు అక్టోబర్ 2023 మధ్య కాలంలో తన సవతి తండ్రి తనపై పదేపదే అత్యాచారం చేశాడని, అసహజ సెక్స్‌లో పాల్గొనమని బలవంతం చేశాడని ఆ చిన్నారి ఫిర్యాదులో పేర్కొందని తెలిపారు.
తనను కొట్టి, తన్నడంతోపాటు చంపేస్తానని బెదిరించేవాడని ఆ బాలిక ఆరోపించిందని, వేధింపులతో విసిగిపోయిన ఆ బాలిక ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. బాలిక ఫిర్యాదు ఆధారంగా నిందితులపై భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.