ఎమ్మెల్యేకు కాంట్రాక్టర్ కమీషన్ ఇవ్వలేదు.. యూపీలో బుల్డోజర్‌తో రోడ్డును తవ్వేశారు

By Mahesh K  |  First Published Oct 5, 2023, 7:43 PM IST

ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు నిర్మిస్తున్న కాంట్రాక్టర్.. ఎమ్మెల్యేకు కమీషన్ ఇవ్వలేదని రోడ్డును తవ్వేసిన ఘటన చోటుచేసుకుంది. ఐదు శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో కాంట్రాక్టు నిరాకరించాడు. దీంతో వారు బుల్డోజర్ పట్టుకుని రోడ్డును ధ్వంసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
 


లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ విస్మయకర ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు వేసిన కాంట్రాక్టర్ స్థానిక ఎమ్మెల్యేకు కమీషన్ ఇవ్వలేదని, ఆ ఎమ్మెల్యే అనుచరులు బుల్డోజర్‌తో రోడ్డునే తవ్వేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌నే కాదు.. దేశవ్యాప్తంగానూ చర్చనీయాంశమైంది. కాంట్రాక్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆగ్రహించినట్టు సమాచారం. రోడ్డును తవ్విన వారి నుంచే ఈ నష్టాన్ని రికవరీ చేయాలని ఆదేశించినట్టు తెలిసింది.

యూపీలో షాజహాన పూర్, బుదౌన్‌ల మధ్య పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఈ రోడ్డు నిర్మాణాన్ని ఓ కాంట్రాక్టర్ చేపట్టారు.  ఆ కాంట్రాక్టరును కొందరు ఆశ్రయించి తమకు ప్రాజెక్టులో 5 శాతం కమీషన్ ఇవ్వాలని అడిగారట. తాము స్థానిక కాట్రా నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే వీర్ విక్రమ్ సింగ్ అనుచరులు అని చెప్పి ఈ డిమాండ్ చేశారని తెలిసింది.

Latest Videos

Also Read: కశ్మీరీల అసలైన ఆహారం రెస్టారెంట్‌లలో ఎందుకు లభించడం లేదు? ఆ వంటకాలెలా ఉంటాయి?

కానీ, ఆ కాంట్రాక్టర్ కమీషన్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో రోడ్డు నిర్మాణంలో ఉన్న కార్మికులపై దాడి చేసిన దుండగులు గాంధీ జయంతి రోజునే అంటే అక్టోబర్ 2వ తేదీన బుల్డోజర్‌తో రోడ్డును తవ్వేశారని కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేయడానికి యత్నిస్తున్నారు. 

స్థానిక బీజేపీ ఎమ్మెల్యే వీర్ విక్రమ్ సింగ్ స్పందిస్తూ వారు తన అనుచరులు కాదని స్పష్టం చేశారు. వారు బీజేపీ కార్యకర్తలేనని ధ్రువీకరిస్తూ వారితో తనకు సంబంధం లేదని తెలిపారు.

click me!