కర్ణాటకలో ఏకంగా ఐరన్ బస్ స్టాప్‌నే ఎత్తుకెళ్లిన దొంగలు.. ఏం జరిగిందంటే?

By Mahesh K  |  First Published Oct 5, 2023, 8:28 PM IST

కర్ణాటకలో ఘరానా దొంగతనం చోటుచేసుకుంది. బెంగళూరులోని కన్నింగ్ హామ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఇనుప బస్ స్టాప్‌ను కొందరు ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు ఫైల్ చేశారు. నిందితుల కోసంసీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
 


బెంగళూరు: కర్ణాటకలో గజదొంగలు ఏకంగా ఐరన్ బస్ స్టాప్‌నే ఎత్తుకెళ్లారు. రూ. 10 లక్షల విలువైన ఇనుప నిర్మాణాన్ని ఎత్తుకెళ్లారు. విధాన సౌధకు ఒక కిలోమీటర్ దూరంలోనే నిర్మించిన ఈ నిర్మాణం రోజుల వ్యవధిలోనే అదృశ్యమవడం కలకలం రేగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

బెంగళూరులో కన్నింగ్ హామ్ రోడ్డులో ఆగస్టు 21వ తేదీన ఓ ఇనుప బస్ స్టాప్‌ను ఏర్పాటు చేశారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఈ బస్ స్టాప్‌ను నిర్వహిస్తున్నది. ఆగస్టు 28వ తేదీన మళ్లీ కన్నింగ్ హామ్ రోడ్డు వద్దకు వెళ్లినప్పుడు ఆ బస్ స్టాప్ అదృశ్యమైందని ఎన్ రవి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బస్ స్టాప్‌ను చోరీ చేశారని నిర్దారణకు వచ్చిన తర్వాత పోలీసులను ఆశ్రయించారు. 

Latest Videos

Also Read: ఎమ్మెల్యేకు కాంట్రాక్టర్ కమీషన్ ఇవ్వలేదు.. యూపీలో బుల్డోజర్‌తో రోడ్డును తవ్వేశారు

అంతకు ముందు అక్కడ పాత బస్ స్టాప్ ఉండేది. దాన్ని కూల్చివేసి కొత్తగా ఇనుప బస్ స్టాప్‌ను ఏర్పాటు చేశారు. కానీ, ఈ ఇనుప బస్ స్టాప్ కూడా మాయం కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

click me!