కరుణ మృతికి సంతాపంగా జాతీయ జెండా అవనతం

First Published Aug 7, 2018, 11:53 PM IST
Highlights

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మరణవార్తతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి సంతాప సూచకంగా తమిళనాడు ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మరణవార్తతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి సంతాప సూచకంగా తమిళనాడు ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. రేపు, ఎల్లుండి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది.

మరోవైపు భారత ప్రభుత్వం కూడా కలైంజర్ మృతికి సంతాపం తెలిపింది. దీనిలో భాగంగా దేశరాజధాని ఢిల్లీలో జాతీయ జెండాని అవనతం చేశారు. అలాగే తమిళనాడు సహా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో అవనతం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రేపు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి. 

click me!