బాబు ఓడిపోయాడు, కేసీఆర్ కూటమి తెలియదు: మోడీ సెటైర్లు

Published : Jan 01, 2019, 07:24 PM IST
బాబు  ఓడిపోయాడు, కేసీఆర్ కూటమి తెలియదు: మోడీ సెటైర్లు

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడ కూటమిని ఏర్పాటు చేస్తున్నారనే విషయం తనకు తెలియదని ప్రధాన మంత్రి మోడీ చెప్పారు.తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఘోరంగా ఓటమి పాలయ్యాడని మోడీ సెటైర్లు వేశారు.


న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ కూడ కూటమిని ఏర్పాటు చేస్తున్నారనే విషయం తనకు తెలియదని ప్రధాన మంత్రి మోడీ చెప్పారు.తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఘోరంగా ఓటమి పాలయ్యాడని మోడీ సెటైర్లు వేశారు.

మంగళవారం నాడు ఆయన ఎఎన్ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో   ఫెడరల్ ఫ్రంట్ విషయమై స్పందించారు.కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై తాను ఏనాడూ ఆలోచించలేదన్నారు.  మహాకూటమి కూడ ప్రజల కోసం కాదన్నారు. మోడీని గద్దె దించడం కోసమే ఈ కూటమిని ఏర్పాటు చేస్తున్నారని  ఆయన చెప్పారు.

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఘోర పరాజయం పాలయ్యాడని మోడీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎజెండాను ప్రజలే నిర్ణయిస్తారని ఆయన తెలిపారు.
తెలంగాణలోనే మహా కూటమికి తొలి దెబ్బ తగిలిందని మోడీ అభిప్రాయపడ్డారు.

2019 ఎన్నికల్లో ఎన్డీఏతో ఎవరూ ఉంటారో ఉండరో తాను ఇప్పుడే చెప్పలేనని మోడీ స్పష్టం చేశారు. కూటమి సత్తా ఏమిటో తెలంగాణ ఎన్నికలతోనే తేలిపోయిందని మోడీ అభిప్రాయపడ్డారు. భాగస్వామ్యపక్షాలను కాంగ్రెస్ పార్టీ గుర్తించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ వ్యవస్థను గౌరవించిందని మోడీ ప్రశ్నించారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేక ఫ్రంట్‌ల ఏర్పాటు విషయమై కేసీఆర్ దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్న విషయాన్ని  విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అప్పుడే రామ మందిరం, తెలంగాణలో గెలుస్తామని చెప్పలేదు: మోడీ

 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు