భర్తలకు విడాకులు: పెళ్లి చేసుకొన్న ఇద్దరు యువతులు

Published : Jan 01, 2019, 04:55 PM IST
భర్తలకు విడాకులు: పెళ్లి చేసుకొన్న ఇద్దరు యువతులు

సారాంశం

ఆరేళ్లుగా ప్రేమించుకొన్న ఇద్దరు వివాహం చేసుకొన్న మ:హిళలు భర్తలకు విడాకులిచ్చి పెళ్లి చేసుకొన్నారు


 లక్నో: ఆరేళ్లుగా ప్రేమించుకొన్న ఇద్దరు వివాహం చేసుకొన్న మ:హిళలు భర్తలకు విడాకులిచ్చి పెళ్లి చేసుకొన్నారు. అయితే వీరిద్దరి వివాహన్ని చట్టబద్దం చేసేందుకు రిజిష్ట్రార్  మాత్రం అంగీకరించలేదు.  ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్‌ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ రాష్ట్రంలోని హమీర్‌పూర్‌కు చెందిన  24, 29 ఏళ్ల వయస్సున్న ఇద్దరు యువతులు ఆరేళ్ల క్రితం తమ కాలేజీలో మొదటిసారి పరిచయమయ్యారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం తెలిసిన ఇరు కుటుంబసభ్యులు యువతులను కాలేజీ మాన్పించి పెళ్లి చేశారు.

చదువు మధ్యలోనే మాన్పించి పెళ్లి చేయడంతో  ఒకరిని విడిచి మరోకరం ఉండలేకపోతున్నామని ఆ యువతులు చెబుతున్నారు. అయితే  తమ ప్రేమను కొనసాగించేందుకు వీలుగా  ఇద్దరూ కూడ తమ భర్తలకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఈ మేరకు ఇద్దరూ కూడ తమ భర్తలకు విడాకులు ఇచ్చారు. గత ఏడాడి డిసెంబర్ 29వ తేదీన  ఈ ఇద్దరు యువతులు పెళ్లి చేసుకొన్నారు. అంతేకాదు ఈ వివాహన్ని చట్టబద్దం చేసుకోవాలని ప్రయత్నించారు. కానీ, ఈ వివాహన్ని రిజిస్టర్ చేయడానికి రిజిష్ట్రార్ మాత్రం అంగీకరించలేదు.

ఈ వివాహన్ని  చట్టబద్దం చేయాలని  యువతుల తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు.స్వలింగ సంపర్కం నేరం కాదని  సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?