ప్రైజ్ మనీ పెంచిన ‘గల్ఫ్ టికెట్’.. 500 నుంచి 50 వేల దిర్హమ్‌ల వరకు.. బంపర్ ఆఫర్

By Mahesh K  |  First Published Mar 12, 2024, 9:28 PM IST

గల్ఫ్ టికెట్ ప్రైజ్ మనీ పెంచింది. ఆరు నెంబర్లలో నాలుగు నెంబర్లు మ్యాచ్ అయి గెలిచిన వారి ప్రైజ్ మనీని గణనీయంగా పెంచినట్టు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.
 


యూఏఈకి చెందిన అగ్రశ్రేణి ఆన్‌లైన్ డ్రా బ్రాండ్ గల్ఫ్ టికెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సూపర్ సిక్స్‌ విన్నర్‌ల ప్రైజ్ మనీ పెంచింది. ఇప్పటి వరకు 500 అరబ్ ఎమిరేట్ దిర్హమ్‌లు ఉండగా.. నేడు దాన్ని 50 వేల ఏఈడీలకు పెంచింది. అయితే.. ఈ సూపర్ సిక్స్ విన్నర్‌లు ఈ 50 వేల ఏఈడీలను పంచుకోవాల్సి ఉంటుంది.

ఆరు నెంబర్లకు ఆరు నెంబర్లు మ్యాచ్ అయితే.. 100 మిలియన్ల ఏఈడీల ప్రైజ్ మనీ ఉంటుంది. అదే ఆరు నెంబర్లకు ఐదు నెంబర్లు మ్యాచ్ అయితే 2 లక్షల ఏఈడీల ప్రైజ్ మనీ గెలుచుకోవచ్చు. ఇవి కాక.. ఆరు నెంబర్లలో నాలుగు నెంబర్లు మ్యాచ్ అయినా గల్ఫ్ టికెట్ ప్రైజ్ మనీ అందిస్తుంది. 

Latest Videos

ఈ నాలుగు నెంబర్లు మ్యాచ్ అయి గెలిచిన వారు గతంలో 500 ఏఈడీలు గెలుచుకునేవారు. కానీ, వీరు గెలుచుకునే అవకాశాలను పెంచుతూనే.. వారు పొందే ప్రైజ్ మనీని కూడా పెంచి గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత సంపన్నం చేయాలని గల్ఫ్ టికెట్ నిర్ణయించుకుంది. అందుకే ఈ నాలుగు నెంబర్లు మ్యాచ్ అయిన విన్నర్లకు.. దాదాపు 50 వేల ఏఈడీల ప్రైజ్ పూల్ నుంచి ప్రైజ్ మనీ ఇస్తారు. తద్వారా వారు గతంలో కంటే ఎక్కువ మొత్తం గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌.. గవర్నర్‌కు సిఫారసు చేయడానికి క్యాబినెట్ నిర్ణయం

ఈ మేరకు గల్ఫ్ టికెట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అద్భుతమైన అవకాశాలను చేజార్చుకోవద్దని పేర్కొంటూ.. ఇప్పుడు మీ సూపర్ సిక్స్ టికెట్స్ తీసుకోండని తెలిపింది. విజేతలుగా మారే అవకాశాన్ని వినియోగించుకోండని ఆ ప్రకటనలో వివరించింది. గల్ఫ్ టికెట్

click me!