
మధ్యప్రదేశ్ : madhyapradeshలోని జబల్‌పూర్‌లో ఓ parents తమ చిన్నారిని చూసుకోవడానికి nannyని ఏర్పాటు చేశారు. అయితే కొద్దిరోజులుగా రెండేళ్ల తమ బిడ్డలో మార్పును వారు గమనించారు. ఎప్పుడు సందడిగా ఉండే ఆ చిన్నారి.. నిశ్శబ్దంగా మారిపోయాడు. అంతేకాదు నీరసంగా కూడా తయారయ్యాడు. దీంతో బాబుకు ఏమయ్యిందో అని తల్లిదండ్రులు చిన్నారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లగా.. చిన్నారి అంతర్గత అవయవాలు వాచిపోయి ఉన్నాయని డాక్టర్ తెలిపాడు. అంతేకాదు చిన్నారిని చిత్రహింసలకు గురి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు.
దీంతో షాక్ కు గురైన చిన్నారి తల్లిదండ్రులు.. ఏం జరిగిందో అర్థంకాక ఇంట్లో.. సీసీ కెమెరాను అమర్చాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే బాబును చూసుకునే నానీకి తెలియకుండా.. సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. సాయంత్రం వారు ఆఫీసులనుంచి ఇంటికి వచ్చాక.. అందులో రికార్డైన దృశ్యం వారిని ఉలిక్కిపడేలా చేసింది. రజినీ చౌదరిగా గుర్తించబడిన నానీని నెలవారీ రూ. 5,000 ఇచ్చి.. బాబును చూసుకోవడానికి నియమించుకున్నారు. జీతంతో పాటు ఆమెకు భోజనం కూడా పెడుతున్నారు. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లిన తర్వాత బిడ్డను చూసుకునే బాధ్యత ఆమెకు అప్పగించారు. అయితే, ఇప్పుడు ఆమె చేసిన పని అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది.
జమ్మూలో ముగ్గురు చిన్నారులను పొట్టన బెట్టుకున్న చిరుతపులి..
దీంతో వెంటనే వారు ఆమె మీద పోలీస్ కంప్టైంట్ ఇచ్చారు. తమ చిన్నారి ఆరోగ్యం పాడవ్వడం గురించి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకోసం బైటికి వెడుతూ.. నమ్మి తమ కలలపంటను వారి చేతుల్లో పెడితే.. వారు చేసే ఘోరాలకు పిల్లల భవిష్యత్తే ప్రశ్నార్థకంలో పడుతోంది. రెండేళ్ల చిన్నారి మీద ఇంత దారుణానికి పాల్పడిన ఘటన నుంచి జబల్‌పూర్ తల్లిదండ్రులు ఇంకా తేరుకోలేదు.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో.. చిన్నారిని నానీ కొట్టడం, జుట్టు పట్టుకుని లాక్కెళ్లడం.. ఈడ్చి చెంపల మీద కొట్టడం, ఇష్టానుసారంగా బాదడం.. మొరటుగా వ్యవహరించడం కనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియో చెబుతోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.