నమ్మ బెంగళూరు అవార్డు నామినేషన్లు షురూ.. ‘కొవిడ్ వారియర్ల కృషి చాటుదాం’

By telugu teamFirst Published Oct 8, 2021, 12:58 PM IST
Highlights

ప్రతియేటా ఉత్తమ బెంగళూరు ప్రజా హీరోలను గుర్తించి అవార్డులతో సత్కరిస్తున్నట్టే ఈ ఏడాది కూడా నమ్మ బెంగళూరు ఫౌండేషన్ అవార్డుల కోసం నామినేషన్లు ఆహ్వానించింది. ఈ ఏడాది కొవిడ్ హీరోలకే అవార్డును డెడికేట్ చేయాలని నిర్ణయించింది. కాబట్టి, నగర వాసులు తమ హీరోలను సంస్థ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నామినేట్ చేయాలని, ఇందుకు ఈ నెల 24వ తేదీ చివరి గడువు అని ఓ ప్రకటనలో పేర్కొంది.

బెంగళూరు: కరోనా మహమ్మారి విలయం అంతా ఇంతా కాదు. దాని నుంచి మానవాళిని కాపడటానికి హెల్త్ వర్కర్లు కృషి అసాధారణం. అంతటి మహమ్మారితో పోరాడిన వారందరూ చీకట్లోనే ఉండటం భావ్యం కాదు. వారి కృషిని గుర్తించి, సత్కరించడం బెంగళూరు ప్రజలు బాధ్యతగా భావించాలని namma bengalutu foundation నగరవాసులను కోరింది. 2009 నుంచి ప్రతియేటా నగర ప్రజల heroesను గుర్తించి నమ్మ బెంగళూరు అవార్డులను ఈ ఫౌండేషన్ అందిస్తున్నది. ఈ ఏడాది (12వ ఎడిషన్) అవార్డులను కొవిడ్ warriorకు డెడికేట్ చేయాలని నిర్ణయించింది. కాబట్టి, ప్రజలు తాము చూసిన, చూస్తున్న కొవిడ్ వారియర్లను నామినేట్ చేయాలని కోరింది. 

ఆరోగ్య యోధారు అవార్డు నామినేషన్లు ప్రారంభమయ్యాయి.

1. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్(ఈ అవార్డు కోసం వైద్యులు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, ఆశా వర్కర్లు, స్వాబ్ కలెక్టర్లు, ల్యాబ్ టెక్నిషియన్లు, వ్యాక్సినేటర్లు, అంగన్వాడీ కార్యకర్తలను వంటివారిని నామినేట్ చేయవచ్చు)

2. ఫ్రంట్ లైన్ వర్కరర్ ఆఫ్ ది ఇయర్(అడ్మినిస్ట్రేటర్లు, పోలీసులు, బీబీఎంపీ అధికారులు, బీఈఎస్‌సీవోఎం/బీడబ్ల్యూఎస్ఎస్‌బీ అధికారులు, స్మశానంలో పనిచేసే వర్కర్లు, అంబులెన్స్ వర్కర్లు, మార్షల్స్, సెక్యూరిటీ, క్యాంటీన్ స్టాఫ్ వంటివారికి ఈ అవార్డు ఇస్తారు) 

3. సోషల్ వర్క్ ఆర్గనైజేషన్/ఇండివిడ్యువల్ ఆఫ్ ది ఇయర్(ఫుడ్, మాస్క్ అండ్ గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, కొవిడ్ కేర్ సెంటర్లు, కమ్యూనిటీ మొబిలైజర్లు, అవేర్‌నెస్/ఔట్‌రీచ్ ప్రొగ్రామ్స్, ఇండివిడ్యువల్ వాలంటీర్ల వంటివారికి ఈ అవార్డు అందిస్తారు)

4. మీడియా చాంపియన్ ఆఫ్ ది ఇయర్(ఉదాహరణకు.. జర్నలిస్టులు, రిపోర్టర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ఆన్‌లైన్ మీడియా)

వీటితోపాటు నమ్మ బెంగళూరియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఉంటుంది. ఈ అవార్డు కోసం హెల్త్‌కేర్ ప్రొఫెషనల్, ఫ్రంట్‌లైన్ వర్కర్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీల షార్ట్ లిస్టు నుంచి జ్యూరీ కమిటీ సెలెక్ట్ చేస్తుంది. ఈ అవార్డుల కోసం నామినేషన్ల గడువు ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. ఎంపిక ప్రక్రియ ముగిశాక డిసెంబర్ 10న విజేతలను ప్రకటిస్తారు. కాబట్టి వెంటనే తమ కొవిడ్ హీరోలను నమ్మ బెంగళూరు వెబ్‌సైట్‌లో నామినేట్ చేయాలని ఫౌండేషన్ ఓ ప్రకటనలో కోరింది.  

గత 11 ఏళ్లలో ఈ అవార్డు కోసం 2.80 లక్షల నామినేషన్లు వచ్చాయి. 99 మందికి అవార్డులను అందజేశారు. ఈ అవార్డుతోపాటు గ్రహీతలు తమ కలలను సాకారం చేసుకునే ప్రయాణాన్ని ఉత్తేజితం చేయడానికి క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది.

సమాజానికి విశేష కృషి చేస్తూ అనామకుడిగా మిగిలిపోతున్న వారిని గుర్తించడమే తమ లక్ష్యమని నమ్మ బెంగళూరు అవార్డు అంబాసిడర్ రమేశ్ అరవింద్ అన్నారు. కరోనా సమయంలో వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టి ప్రజా సేవ చేసిన వారిని గుర్తించాలని బెంగళూరువాసులను జ్యూరీ చైర్‌పర్సన్, ట్రస్టీ ప్రదీప్ కర్ అన్నారు.

click me!