ఇండియాలో పెరిగిన కరోనా రికవరీ కేసులు: మార్చి తర్వాత అత్యధికం

By narsimha lodeFirst Published Oct 8, 2021, 10:52 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 21,257 కేసులు రికార్డయ్యాయి. కరోనాతో గత 24 గంటల్లో 271 మంది మృతి చెందారు.

న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 21,257 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజు 13,85,706 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 21,257 మందికి కరోనా  సోకినట్టుగా తేలింది.

also read:ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు: కేరళలోనే అధికంగా కేసులు

అంతకుముందు రోజుతో పోలిస్తే కొద్దిగా స్వల్పంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.నిన్న ఒక్క రోజే  కరోనాతో 271 మంది కరోనాతో మృతి చెందారు.దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 2,40,221కి చేరుకొన్నాయి. 205 రోజుల తర్వాత కరోనా యాక్టివ్ కేసులు అతి తక్కువగా నమోదు కావడం ఇదే ప్రథమంగా ICMR తెలిపింది.

India లో ఇప్పటికే 3.39 కోట్లకు corona కేసులు చేరుకొన్నాయి.  నిన్న ఒక్క రోజే కరోనా నుండి 24,963 మంది కోలుకొన్నారు. దేశంలో  కరోనా రికవరీల సంఖ్య 3.32 కోట్లకు చేరుకొందికరోనా రోగుల రికవరీ  రేటు 97.96 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటివరకు కరోనా  రికవరీ రేటులో ఇదే అత్యధికమని ఐసీఎంఆర్ గణాంకాలు చెబుతున్నాయి.

దేశంలోని కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల కన్పిస్తోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అభిప్రాయపడుతోంది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మిజోరాం ,కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు  ఎక్కువగా నమోదౌతున్నాయని ఐసీఎంఆర్ తెలిపింది.

పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళలలోని కొన్ని జిల్లాల్లో కరోనా యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.0-19 ఏళ్ల వయస్సు ఉన్న యువత, మహిళల్లో కరోనా కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉందని ఓ అధ్యయనంలో తేలిందని వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు. 

దేశంలోని సుమారు 34 జిల్లాల్లో 10 శాతానికంటే ఎక్కువగా వీక్లీ పాజిటివిటీ రేటు నమోదైనట్టుగా రికార్డులు చెబుతున్నాయి. మరో 28 జిల్లాల్లో 5 నుండి 10 శాతం వీక్లీ పాజిటివిటీ రేటు రికార్డైనట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.


 

click me!