
ఉత్తర ప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ లోని Lakhimpur Kheriలో నిరసన తెలుపుతున్న రైతుల మీదినుంచి వాహనం తోలి, ఎనిమిదిమంది మృతి చెందిన కేసులో నిందితుడుగా కేంద్ర మంత్రి ajay mishra కుమారుడు ashish mishra ఆరోపణలు ఎదుర్కొంటున్ సంగతి తెలిసిందే. ఈ కేసులో అశిష్ మిశ్రాను ప్రశ్నించేందుకు వచ్చిన ఒక సీనియర్ పోలీసు అధికారిని అశిష్ మిశ్రా ఎదురుచూసేలా చేశాడు.
కేసు విచారణలో భాగంగా అతన్ని విచారించేందుకు పోలీసు అధికారి అశిష్ మిశ్రా ఇంటికి వెళ్లారు. ఈ ఘటన మీద ప్రతిపక్షల నిరసనలు వెల్లువెత్తడంతో అతనికి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏడాది ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరగాలి. ఈ సమయంలో లఖింపూర్‌లో ఆదివారం చెలరేగిన హింస వచ్చే అక్కడ ప్రధాన రాజకీయ సమస్యగా మారింది.
జూనియర్ హోం మంత్రి అజయ్ మిశ్రా, యుపి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య లను రైతులు ఘెరావ్ చేసిన నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అజయ్ మిశ్రా కాన్వాయ్ రైతుల మీదికి దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మరణించారు.
అజయ్ మిశ్రాను ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని కోరుతూ.. ఎనిమిది మంది సభ్యుల దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తున్న పోలీసు ఉన్నతాధికారి ఉపేంద్ర అగర్వాల్ అతని కోసం చాలాసేపు వేచి ఉన్నాడని అధికారులు తెలిపారు. అజయ్ మిశ్రామీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌లో డిమాండ్ చేశారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం, అజయ్ మిశ్రా వ్యాఖ్యలకు నిరసనగా శాంతియుతంగా నల్ల జెండాలు పట్టుకుని రైతులు నిరసన తెలిపారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆశిష్ మిశ్రా తన మూడు వాహనాలు, 15-20 మంది ఆయుధాలతో బన్వారీపూర్ సమావేశ స్థలానికి వెళ్లాడు. ఆ తరువాత అక్కడ నిరసన తెలుపుతున్నవారిమీది నుంచి వాహానాన్ని తోలాడు. అంతేకాదు కాల్పుల కారణంగా, రైతు సుఖ్వీందర్ సింగ్ 22 ఏళ్ల కుమారుడు గుర్విందర్ మరణించాడు, "అని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
గురువారం, కేంద్ర మంత్రి ఇంటి బయట పోలీసులు అతని కుమారుడి సమక్షంలో నోటీసును అతికించారు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు ప్రియాంకా గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ, లాంటి ప్రతిపక్షనేతలు.. పోలీసులు నిందితులను కాపాడుతున్నారని ఆరోపించారు.
ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరడంతో గురువారం ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు - లవ్ కుష్, ఆశిష్ పాండేలను అరెస్టు చేశారు. జర్నలిస్ట్, రైతుల మీదినుంచి వెళ్లిన వాహానాల్లో వారు ఉన్నారని, మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
Lakhimpur Kheri: ఎవరినీ అరెస్ట్ చేయలేదు.. విచారణకు రావాల్సిందిగా ఆశీష్ మిశ్రాకు సమన్లు, ఐజీ ప్రకటన
"ఆశిష్ మిశ్రాకు సమన్లు జారీ చేశాం. వీలైనంత త్వరగా విచారణకు రావాలని కోరాం. అతనిపై మరిన్ని చర్యలు తీసుకుంటాం" అని లక్నో జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ లక్ష్మీ సింగ్ గురువారం చెప్పారు. "మేం ఎవరికీ రక్షణ కల్పించడం లేదు. ఈ దేశంలో చట్టం అందరికీ సమానమే. కఠిన చర్యలు తీసుకునేలా చూస్తాం" అని లక్ష్మి సింగ్ అన్నారు. ఈ కేసులో 13 మంది పేర్లు ఉన్నాయి.
లఖింపూర్ ఖేరీ హింసకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు గురువారం "ఎంత మందిని అరెస్టు చేశారు" అని ప్రశ్నించింది. శుక్రవారం నాటికి స్టేటస్ నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అజయ్ మిశ్రా, అతని కుమారుడు తాము ఆ స్థలంలో లేమని తిరస్కరించారు. కాగా అజయ్ మిశ్రా కేంద్రమంత్రి పదవి నుంచి వైదొలగాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా అజయ్ మిశ్రా హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అతని రాజీనామాను తోసిపుచ్చినట్లు సంబంధిత వర్గాల సమాచారం.